AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ నుంచి బయటకు రావాలనుకోలేదు.. కానీ అందుకే వచ్చేశా.. అసలు విషయం చెప్పిన ధనరాజ్

ప్రముఖ కమెడియన్, దర్శకుడు, నటుడు ధన్‌రాజ్ తన కెరీర్, ముఖ్యంగా జబర్దస్త్ నుంచి బయటకు రావడం వెనుక ఉన్న షాకింగ్ వాస్తవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్ వంటి నటులు టీమ్ లీడర్లుగా ఎలా ఎదిగారు అనే అంశాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జబర్దస్త్ నుంచి బయటకు రావాలనుకోలేదు.. కానీ అందుకే వచ్చేశా.. అసలు విషయం చెప్పిన ధనరాజ్
Jabardasth Dhanraj
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2026 | 12:21 PM

Share

ధన్‌రాజ్ మాట్లాడుతూ.. “పనిలేని పులిరాజా” అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సమయంలో, వేణు, ఏడుకొండలు (మేనేజర్) ఒక కొత్త షో గురించి ప్రస్తావించారు. ఆలీ టాకీస్ పేరుతో ఆలీ గారు ప్రారంభించాలనుకున్న షోను మా టాకీస్గా మార్చి, అందులో వేణు, ధన్‌రాజ్ ఇద్దరూ యాంకర్లుగా ఉంటే బాగుంటుందని ఆఫర్ చేశారు. దీనిపై మల్లెమాల ప్రొడక్షన్స్‌తో చర్చించినప్పుడు, దీప్తి గారు, కీర్తి గారు “ఎక్స్‌క్లూజివిటీ” అంశాన్ని లేవనెత్తారు. “మీరు ఇక్కడా, అక్కడా కనిపిస్తే ఎక్స్‌క్లూజివ్ అవ్వదు. అది పూర్తి చేసి ఇక్కడికి రండి, మల్లెమాలలో మీకు ఎప్పుడూ స్థానం ఉంటుంది” అని వారు స్పష్టం చేశారు. అలాగే, జబర్దస్త్ డైరెక్టర్ సంజయ్ గారు కూడా ఆ సమయంలో బయటకు వచ్చేశారు. కేవలం 13 ఎపిసోడ్‌ల కోసం అనుకున్న ఈ కొత్త షో, ప్రజాదరణ కారణంగా 24 ఎపిసోడ్‌ల వరకు కొనసాగింది. ధన్‌రాజ్, వేణు వంటి ఇద్దరు కీలక టీమ్ లీడర్లు ఒకేసారి బయటకు వెళ్లడంతో జబర్దస్త్ టీమ్ పెద్ద సవాలును ఎదుర్కొందని ఆయన గుర్తుచేసుకున్నారు.

“నెక్స్ట్ వన్ వీక్‌లో షూటింగ్ అనగా మేము వెళ్ళిపోయాం. అప్పుడు సుధీర్‌ని తయారు చేసి, వేణు వాళ్ళ కంటెస్టెంట్‌గా ఉన్న సుధీర్‌ని గెటప్ శ్రీను చేయించి, నా టీమ్ నుంచి రామ్ ప్రసాద్‌ని అటు పెట్టి, రాకింగ్ రాకేష్‌కు టీమ్ ఇచ్చి షఫుల్ చేసారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్న విషయం మేము మర్చిపోయాం” అని ధన్‌రాజ్ ఆనాటి పరిస్థితిని వివరించారు. తాను బయటకు రావడానికి గల కారణాలపై మాట్లాడుతూ.. “మనం బోర్ కొట్టకముందే వచ్చేయాలి. మనం బోర్ కొట్టినాక వాళ్ళు పంపించకూడదు. ఆ తృప్తి ఉండాలంటే అలా వచ్చేయాలి” అని ధన్‌రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జబర్దస్త్ షూటింగ్ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండేదని, రోజుకు మూడు ఎపిసోడ్‌లు చిత్రీకరించేవారని, దీనికి స్కిట్‌లు రాయడం, రిహార్సల్స్ వంటివి తోడయ్యేవని ఆయన తెలిపారు. ఈ తీవ్రమైన పని ఒత్తిడి, సినిమా అవకాశాలతో డేట్లు సర్దుబాటు చేయడంలో తలెత్తిన సమస్యలు కూడా బయటకు రావడానికి కారణమయ్యాయని ఆయన వివరించారు.

తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను కూడా ధన్‌రాజ్ పంచుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన, తల్లి తన మొదటి సినిమా జై చూసిన తర్వాతే మరణించారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కారణంగా, తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసిన ధన్‌రాజ్‌కు నటన తప్ప మరో మార్గం లేదని చెప్పారు. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తాను పడిన తపన అపారమని, నటుడిగా, టీమ్ లీడర్‌గా, ప్రొడ్యూసర్‌గా (సక్సెస్ కాలేదు), స్టేజ్ షోలు, దర్శకత్వం… ఇలా ప్రతి పని చేశానని ఆయన పేర్కొన్నారు. “ఈ క్రాప్స్ లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు” అని ఆయన వివరించారు. “జబర్దస్త్ అనేది సినిమా థియేటర్ కి తీసుకెళ్తది మేడం, టీవీ వాళ్ళ బెడ్ రూమ్ కి వచ్చేస్తది” అని చెప్పిన ధన్‌రాజ్, తన పేరు ధనాధన్ ధన్‌రాజ్‌గా ప్రజల్లో స్థిరపడటానికి జబర్దస్తే కారణమని, సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బులే తనకు సహాయపడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఇదంతా కాలం నిర్ణయించిందని, మార్పు తథ్యం అని నమ్ముతూ, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us