Akkineni Sumanth: వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

'ప్రేమకథ', 'యువకుడు', 'సత్యం', 'గోదావరి', 'గోల్కోండ హైస్కూల్‌', 'మళ్లీరావా' వంటి ఫీల్‌గుడ్ మూవీస్‌తో ఆకట్టుకున్నాడు అక్కినేని సుమంత్ (Akkinenei Sumanth).

Akkineni Sumanth: వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..
Akkinenei Sumanth
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2022 | 6:46 AM

‘ప్రేమకథ’, ‘యువకుడు’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్‌’, ‘మళ్లీరావా’ వంటి ఫీల్‌గుడ్ మూవీస్‌తో ఆకట్టుకున్నాడు అక్కినేని సుమంత్ (Akkinenei Sumanth). ఇటీవల ‘సుబ్రమణ్యపురం’, ‘ఇదం జగత్‌’, ‘కపటదారి’ వంటి యాక్షన్‌ చిత్రాలతో వచ్చిన ఈ హీరో ఇప్పుడు తొలిసారి పూర్తి మాస్‌ హీరోగా మన ముందుకు వస్తున్నాడు. అదే ‘వాల్తేరు శీను’ (valtherseenu). విశాఖపట్నం రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఐమా హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రాజశేఖర్‌రెడ్డి తెరెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా సుమంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదలచేసింది చిత్రబృందం. ఇందులో గడ్డంతో రగ్డ్‌ లుక్‌లో కనిపించి మాస్‌ను మెప్పించారీ హీరో. హీరో మాస్‌ లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తుంది.

కాగా ఈ సినిమాలో మధు నందన్‌, హైపర్‌ ఆది, మిర్చి కిరణ్‌, ప్రభ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి మార్క్‌.కె.రాబిన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇక ‘వాల్తేర్‌ శీను’ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సుమంత్ తన పుట్టిన రోజుకు గిఫ్ట్ అందించిన చిత్ర బృందానికి థ్యాంక్స్‌ తెలిపాడు. కాగా సుమంత్‌ నటించిన తాజా చిత్రం ‘మళ్లీ మొదలైంది’ ఈ నెల 11న ‘జీ 5’ ఓటీటీలో విడుదల కానుంది. నైనా గంగూలీ అక్కినేని హీరో సరసన నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభిస్తోంది.

View this post on Instagram

A post shared by Sumanth (@sumanth_kumar)

Also Read:UP Congress Manifesto: వ్యవసాయ రుణాల మాఫీ, మహిళలకు 40శాతం ఉద్యోగాలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట నయా పోస్టర్.. కళావతి ప్రేమలో తేలిపోతున్న మహేష్

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?