Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో హామీల వర్షం కురుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి. మొన్న భారతీయ జనతా పార్టీ(BJP).. నిన్న కాంగ్రెస్(Congress) తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. యూపీలో తొలి విడత పోలింగ్‌కు ఒకరోజు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బుధవారం లక్నోలో ‘ఉన్నతి విధాన్’ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మేనిఫెస్టో ప్రధానంగా మహిళలు, రైతులు, చిరు వ్యాపారుల సాధికారత, అభ్యున్నతిపై దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్ ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా.. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమను గెలిపిస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పశువులు మేత మేయడం వల్ల పంట నష్టపోయే రైతులకు 3000 పరిహారంగా చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. లఖ్‌నవూలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఆ తర్వాత మరో 8 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. వరి, గోధుమలకు క్వింటాలుకు 2500, చెరకు ధర క్వింటాలుకు 400, కొవిడ్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షల పరిహారం, కొవిడ్ బాధిత కుటుంబాలకు 25 వేలు సాయం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య అంశాల్ని మేనిఫెస్టోలో చేర్చారు.
మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, “ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ అభివృద్ధి, సంక్షేమాన్ని ఎజెండాగా ఉంచే ప్రభుత్వానికి అర్హులని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోందని, అలాంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు అవసరమన్నారు. వారి జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. యుపి కాంగ్రెస్‌కు చెందిన ఉన్నతి విధాన్ దీనికి మార్గాన్ని సిద్ధం చేస్తుందన్నారు.
యూపీ ఎన్నికల కోసం బీజేపీ మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టో కాపీ పేస్ట్ అని ఆరోపించారు ప్రియాంక. తాము ప్రచారంలో చేసిన వాగ్దానాలను ఆ పార్టీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిందని విమర్శించారు. గత ఐదేళ్లలో ఏమీ చేయని ఆ పార్టీ, కాంగ్రెస్ 70 ఏళ్లలో ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను బీజేపీ కనీసం సగం కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రైతులు, విద్యార్థులపై దృష్టి సారించింది. కాంగ్రెస్ యూపీ మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి….
Congress leader Priyanka Gandhi Vadra launches the Congress manifesto ‘Unnati Vidhan Jan Ghoshna Patra-2022’ for #UttarPradeshElections pic.twitter.com/63uoNspG9x
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 9, 2022
ఇదిలా ఉండగా, జాట్ల ప్రాబల్యం ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం మంగళవారంతో ముగిసింది. హాపూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, షామ్లీ, బాగ్పత్, ముజఫర్‌నగర్, మీరట్, అలీగఢ్, ఘజియాబాద్, బులంద్‌షహర్, ఆగ్రా, మథుర సహా పదకొండు జిల్లాల్లో ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 27, మార్చి 3 మరియు మార్చి 7న ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
Read Also…. Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..