Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 10, 2022 | 6:25 AM

Horoscope Today : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 10వ తేదీ ) గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.

వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. తోటివారి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం

ఈ రాశి వారు భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

కర్కాటకం

కృషికి తగ్గ ఫలితలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. కుటుంబంలో అనారోగ్యబాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.

సింహం

ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

కన్య

మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల

ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.

వృశ్చికం

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

ధనుస్సు

ఈ రాశి వారు మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు

మకరం

మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.

మీనం

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)