Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట నయా పోస్టర్.. కళావతి ప్రేమలో తేలిపోతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట నయా పోస్టర్.. కళావతి ప్రేమలో తేలిపోతున్న మహేష్
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 10, 2022 | 6:36 AM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో మహేష్ మోకాలికి సర్జరీ జరగడం.. ఆ తర్వాత మహేష్.. కీర్తి సురేష్ కోవిడ్ బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది.

ఇక ప్రేమికుల రోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి అందమైన మెలోడీని విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ మహేష్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు కూల్ అండ్ స్టైలిష్ గా.. ప్రిన్స్ లా కనిపిస్తున్నారు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మహేష్ లుక్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఫిబ్రవరి 14న కళావతి అనే పాటను విడుదల చేయనున్నారు. సర్కారు వారి పాట సినిమా కోసం తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్-  14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Mahesh Babu

Mahesh Babu

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyamani: కొంటె చూపులతో కవ్విస్తున్న కాటుకళ్ల చిన్నది.. ప్రియమణి లేటెస్ట్ ఇమేజెస్

Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్

Alia Bhatt: అందాల ఆలియా పరువాలు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్