AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్లు నాటకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి.. గుంటూరులో సరికొత్త ఆల్గే ట్రీ టెక్నాలజీ!

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొక్కలను పెద్ద ఎత్తున ప్రతి ఏటా నాటుతున్నారు. అయితే కాంక్రీట్ జంగిల్స్ గా మారిన నగరాల్లో సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఆల్కే ట్రీస్ అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ గా గుంటూరు నగరంలోని ఆల్కే ట్రీ ని ఏర్పాటు చేశారు. ఇరవై ఐదు చెట్లు విడుదల చేసే ఆక్సిజన్ ను విడుదల చేయడం ఈ ఆల్గే ట్రీ ప్రత్యేకత.

T Nagaraju
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 1:01 PM

Share

1 / 5
గుంటూరు నగరం అంతకంతకూ విస్తరిస్తుంది. ప్రతి ఏటా పెరిగిపోతున్న వాహనాలతో కాలుష్యం కూడా పెరుగుతుంది. వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్పోరేషన్ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఆల్గే ట్రీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని గాంధీ పార్క్ లో మొదటి ఆల్గే ట్రీని ఏర్పాటు చేశారు.

2 / 5

ఆరు వందల లీటర్ల సామార్థ్యం ఉన్న ట్యాంక్ లో నీటిలో ఆల్గేను ఉంచుతారు. ట్యాంక్ పై భాగంలో ఫ్యాన్లు ఉంటాయి. ఆ పైన సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్ తో ఫ్యాన్లు తిరుగుతుంటాయి. ఈ ప్యాన్లు గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను ఆల్గే ట్యాంక్ లోకి పంపుతాయి. ఆల్గే కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ ను ఆక్సిజన్ మార్చి విడుదల చేస్తుంటుంది.

3 / 5
ఇరవై ఐదు చెట్లు విడుదల చేసే ఆక్సిజన్ ను ఈ ఆల్గే ట్రీ ఒక్కటే చేస్తుంది. ఫ్యాన్లతో పాటు సెన్సర్స్, లైట్స్ ఉంటాయి. చాలా త్వరగా కిరణ జన్య సంయోగ క్రియ జరిపి ఆక్సిజన్ విడుదల చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఐదు లక్షల రూపాయల వ్యయంతో లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సిఎస్ఆర్ నిధులతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే మెట్టమొదటి సారి పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు కార్పోరేషన్ కమీషనర్ మయూర్ అశోక్ తెలిపారు.

4 / 5

దేశంలో మధ్యప్రదేశ్ లో మాత్రమే ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆల్గే ట్రీని ఏర్పాటు చేయగా ఏపిలోని గుంటూరు నగరంలో ఈ ఆల్గే ట్రీని పెట్టారు. ఈ చెట్టు 15 మీటర్ల పరిధిలో వాయి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అంటున్నారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడంతో త్వరలోనే ఫలితాలను విశ్లేషించి మరిన్నీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని కమీషనర్ మయూర్ అశోక్ తెలిపారు.

5 / 5
Follow Us