Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట

టాలీవుడ్ లో మంచి అభిరుచికలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. నాని హీరోగా నటించిన అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా..

Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట
Aa Ammayi Gurinchi Meeku Ch
Follow us

|

Updated on: Feb 10, 2022 | 7:08 AM

Aa Ammayi Gurinchi Meeku Cheppali: టాలీవుడ్ లో మంచి అభిరుచికలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ(Mohana Krishna Indraganti). నాని హీరోగా నటించిన అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రగంటి. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా గ్రహణం. ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మాయ బజార్ అనే సినిమా చేశారు. అందమైన కథతోపాటు చక్కటి కామెడీని కూడా జోడించి మంచి సినిమాలను అందించారు ఇంద్రగంటి. అష్ట చమ్మ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా వచ్చిన సమ్మోహనం సినిమా మంచి హిట్టును సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాని సుధీర్ బాబులతో ‘వి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు మరోసారి సుధీర్ బాబుతో సినిమా చేస్తున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి అందమైన పాటను విడుదల చేయనున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను చైత్ర అంబడిపూడి, అభయ్ జోధ్‌పుర్కర్ ఆలపించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ – వెన్నెల కిషోర్ – రాహుల్ రామకృష్ణ – శ్రీకాంత్ అయ్యంగార్ – కళ్యాణి నటరాజన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyamani: కొంటె చూపులతో కవ్విస్తున్న కాటుకళ్ల చిన్నది.. ప్రియమణి లేటెస్ట్ ఇమేజెస్

Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్

Alia Bhatt: అందాల ఆలియా పరువాలు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్