టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంది.
మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'మెకానిక్ రాకీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది. వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన 'మట్కా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంక్రాంతి బరిలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మీనాక్షి చౌదరికి భారీ క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది.