OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే రియల్ మిస్టరీ స్టోరీ.. ఓటీటీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ఈ వీకెండ్ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమా మీకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

ఈ వారంలోనూ ఓటీటీలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి .ఇప్పటికే రజనీకాంత్ జైలర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శుక్రవారం (నవంబర్ 13) రణబాలి, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం, దాయిరా, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్ తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటి సంగతి పక్కన పెడతే.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. ఇదొక అడ్వెంచర్, సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంచలన సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాహసయాత్ర, ప్రమాదకరమైన ద్వీపం, అక్కడికి వెళ్లిన ఓ యువకుడి ప్రయాణం.. ఇలా ఉత్కంఠ కలిగించే అంశాలతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. ఐఎమ్ డీబీలోనూ ఈ చిత్రానికి టాప్ రేటింగ్ దక్కడం విశేషం.
ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు లాస్ట్ డేస్ (Last Days). హాలీవుడ్ దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే మెయిన్ రోల్ పోషించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే అండమాన్‌లోని ‘నార్త్ సెంటినల్ ఐలాండ్’ నేపథ్యంలో సాగే ఒక నిజ జీవిత గాథ. 26 ఏళ్ల అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చౌ (స్కై యాంగ్) ఆ ద్వీపంలోని గిరిజనులను కలవాలని, వారికి తన మతాన్ని బోధించాలని ప్రాణాలకు తెగించి వెళతాడు. అయితే పోలీస్ అధికారి మీరా గనాలి (రాధికా ఆప్టే), స్థానిక డిటెక్టివ్ కలిసి ఆయనను ఆపడానికి ప్రయత్నిస్తారు. మరి చివరికి జాన్ చౌ ఆ ద్వీపంలోకి ఎలా అడుగుపెట్టాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ లాస్ట్ డేస్ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ బైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.
లాస్ట్ డేస్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




