ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 62 ఏళ్ల ఇందుకూరి విజయలక్ష్మి డ్రగ్స్ వాడకంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. 50 రోజుల్లో లక్ష మంది విద్యార్థులను కలవడమే లక్ష్యంగా ఆమె సాగుతున్నారు. హైదరాబాద్ చేరుకున్న ఆమెకు తెలంగాణ పోలీసులు ఘన స్వాగతం పలికారు.