AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!

మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 12:42 PM

Share

హరియాణాలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన మిఠాయిల స్టాల్‌పై వేలాది తేనెటీగలు దాడి చేశాయి. స్వీట్ల వాసనకు ఆకర్షితమైన తేనెటీగలు వాటిపై గుంపులుగా వాలడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. కస్టమర్లు వెనక్కి తగ్గడంతో వ్యాపారికి భారీ నష్టం వాటిల్లింది. దాదాపు రూ.2 లక్షల విలువైన మిఠాయిలు అమ్ముడుపోకపోవడంతో కొన్ని స్వీట్లను స్థానికులకు ఉచితంగా పంచిపెట్టాల్సి వచ్చింది.

దీపావళి పండుగ సమయంలో భారీ అమ్మకాలతో లాభాలు గడించాలనుకున్న ఓ మిఠాయి వ్యాపారికి తేనెటీగలు ఊహించని షాక్ ఇచ్చాయి. వేల సంఖ్యలో తేనెటీగలు మిఠాయిలపైకి దండులా పోటెత్తడంతో వ్యాపారికి భారీగా నష్టం వాటిల్లింది. ఈ విచిత్రమైన ఘటన హరియాణాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. హరియాణాలోని భివానీ ప్రాంతానికి చెందిన ఒక మిఠాయి వ్యాపారి దీపావళి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో రకరకాల మిఠాయిలను తయారు చేయించాడు. వాటిని విక్రయించడం కోసం రోడ్డు పక్కనే ఒక బహిరంగ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. అయితే మిఠాయిల నుంచి వస్తున్న గుబాళింపు వాసనకు ఆ ప్రాంతంలోని తేనెటీగలు ఒక్కసారిగా ఆకర్షితులయ్యాయి. పెద్ద ఎత్తున తేనెటీగల దండు వచ్చి నేరుగా ఆ స్వీట్లపై వాలాయి. గుంపులు గుంపులుగా వచ్చి స్వీట్లపై మూగిన తేనెటీగలను చూసి స్టాల్‌ సిబ్బంది ఆందోళ చెందారు. వాటిని తరిమికొట్టడానికి ఎంత ప్రయత్నించినా అవి అక్కడి నుంచి కదలకపోగా.. మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తేనెటీగలు జరిపిన దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. తేనెటీగలు పూర్తిగా మూగడంతో ఆ మిఠాయిలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేది లేక చివరకు ఆ మిఠాయిలలో కొన్నింటిని స్థానికులకు ఉచితంగా పంచిపెట్టాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఈ విచిత్ర ఘటన వల్ల తనకు దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్‌.. ఇల్లు దగ్ధం!

వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!

వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్‌!

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!

Follow Us