AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో బియ్యాన్ని ఎంతకు అమ్మాలి? ఎంతకు అమ్ముతున్నారు? అసలేం జరుగుతోంది?

కిలో బియ్యాన్ని ఎంతకు అమ్మాలి? ఎంతకు అమ్ముతున్నారు? అసలేం జరుగుతోంది?

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 2:29 PM

Share

తెలంగాణలో బియ్యం ధరలు అమాంతం పెరగడం సామాన్యులకు భారంగా మారింది. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు, పలు బియ్యం రకాలకు గరిష్ఠ రిటైల్ ధరలను నిర్ణయించింది. బరువులో మోసాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలో బియ్యం ధరల పెరుగుదల సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కిలో బియ్యంపై 5 నుండి 10 రూపాయల వరకు ధరలు పెరిగాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ధాన్యం కొరత కంటే కొంతమంది వ్యాపారులు, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి, సరుకును నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయించడమే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తూ, పౌరసరఫరాల, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ధరల మోసాలతో పాటు, బియ్యం బస్తాల బరువులో మోసాలు (26 కిలోలకు బదులుగా 25 కిలోలు), ప్యాకెట్లపై ఎక్కువ ధరలు స్టిక్కర్లు అంటించడం, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 29 నుండి నవంబర్ 5 వరకు జరిగిన తనిఖీల్లో 55 కేసులు (35 క్రిమినల్ కేసులు) నమోదు చేయబడ్డాయి. ప్రభుత్వం BPT, KNM బియ్యం కిలో గరిష్ఠ ధర ₹66, RNR, తెలంగాణ సోనా కిలో ₹74, HMT, JSR బియ్యం కిలో ₹79గా నిర్ణయించింది. వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై ధర, బరువును పరిశీలించి, మోసాలు జరిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరాట్ కోహ్లీతో మాట్లాడాలంటే కోచ్‌లు సైతం భయపడతారా?

అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్! అసలేం జరిగింది?

ఆ చెట్టుతో వాయు కాలుష్యానికి చెక్‌.. ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి!

బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్‌.. ఇల్లు దగ్ధం!

వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!

Follow Us