AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములక్కాడ మటన్ కర్రీ.. అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్!

మునక్కాడ మటన్ కర్రీ రుచిగా ఈజీగా చేయాలనుకుంటున్నారా? ఈ విలేజ్ స్టైల్ రెసిపీతో మటన్ మెత్తగా ఉడికి, మునక్కాడలు విడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. పర్ఫెక్ట్ మసాలాలు, సరైన పద్ధతులతో వంట సువాసనగా, అద్భుతమైన రుచితో సిద్ధం చేయండి. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Nov 12, 2026 | 9:47 PM

Share

కావాల్సిన  పదార్థాలు: మటన్ – అరకిలో,  పసుపు – 1/2 టీస్పూన్ ,  ఉప్పు – రుచికి సరిపడా,   కారం – 1 టేబుల్ స్పూన్, 
 1 టేబుల్ స్పూన్ ,  దాల్చినచెక్క – చిన్న ముక్క, లవంగాలు 3, యాలకులు 1-2, నూనె – కొద్దిగా ఎక్కువ, ఉల్లిపాయలు – 2, 
పచ్చిమిర్చి 4-5 , కరివేపాకు – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద టేబుల్ స్పూన్,  మునక్కాడలు  2-3, టమాటాలు – 3 పెద్దవి 
గరం మసాలా  1/2 టీస్పూన్,   కొత్తిమీర తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: మటన్ – అరకిలో, పసుపు – 1/2 టీస్పూన్ , ఉప్పు – రుచికి సరిపడా, కారం – 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ , దాల్చినచెక్క – చిన్న ముక్క, లవంగాలు 3, యాలకులు 1-2, నూనె – కొద్దిగా ఎక్కువ, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి 4-5 , కరివేపాకు – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద టేబుల్ స్పూన్, మునక్కాడలు 2-3, టమాటాలు – 3 పెద్దవి గరం మసాలా 1/2 టీస్పూన్, కొత్తిమీర తీసుకోవాలి.

1 / 5
అరకిలో మటన్‌ను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మటన్ తీసుకుని, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మసాలాలు మటన్‌కు బాగా పట్టేలా చూసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన మటన్‌ను ప్రెజర్ కుక్కర్‌లోకి మార్చుకుని, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టాలి. మటన్ లేతగా ఉంటే మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ అవసరం అవుతాయి. ఉడికిన తరువాత మటన్ మెత్తగా, పర్ఫెక్ట్‌గా ఉండాలి.

2 / 5

 ఒక మందపాటి పాన్‌ను వేడి చేసి, నాన్ వెజ్ కూరలకు అవసరమైన విధంగా కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు-ఐదు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తరువాత, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పూర్తిగా పోయి మంచి సువాసన వచ్చే వరకు చక్కగా వేయించాలి. తరువాత, కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను వేసి, ఒక నిమిషం పాటు వేయించి, మంటను సిమ్‌కు తగ్గించి, మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది.

3 / 5
మునక్కాడలు మగ్గిన తరువాత, మూడు పెద్ద టమాటాలను పేస్ట్‌గా చేసి కూరలో వేయాలి. మరో టేబుల్ స్పూన్ కారం వేసి  అన్నింటినీ బాగా కలుపుకోవాలి.  మంటను మీడియం ఫ్లేమ్‌కు అడ్జస్ట్ చేసి, టమాటా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. ఇది చాలా ముఖ్యం, లేదంటే కూరలో పచ్చి వాసన ఉంటుంది

4 / 5
టమాటా పేస్ట్ చక్కగా వేగి నూనె పైకి తేలిన తరువాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను నీటితో సహా పాన్‌లోకి వేయాలి.
 అంతా బాగా కలిపి, గ్రేవీ మీకు కావలసిన చిక్కదనంలో ఉండేందుకు, మునక్కాడలు మరియు మటన్‌కు రుచి పట్టేందుకు ఇంకొన్ని నీళ్లు అవసరమైతే కలుపుకోవచ్చు. మూత పెట్టి, మంటను లో ఫ్లేమ్‌కు తగ్గించి, నూనె పైకి తేలే వరకు, గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.
 గ్రేవీ చిక్కబడి, నూనె చక్కగా పైకి తేలిన తరువాత, తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇంట్లో దంచి పెట్టుకున్న అర టీస్పూన్ గరం మసాలా వేసి  ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. వేడి వేడి అన్నంతో ఈ అద్భుతమైన మునక్కాడ మటన్ కర్రీ తింటే ఆ రుచే వేరు.

టమాటా పేస్ట్ చక్కగా వేగి నూనె పైకి తేలిన తరువాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను నీటితో సహా పాన్‌లోకి వేయాలి. అంతా బాగా కలిపి, గ్రేవీ మీకు కావలసిన చిక్కదనంలో ఉండేందుకు, మునక్కాడలు మరియు మటన్‌కు రుచి పట్టేందుకు ఇంకొన్ని నీళ్లు అవసరమైతే కలుపుకోవచ్చు. మూత పెట్టి, మంటను లో ఫ్లేమ్‌కు తగ్గించి, నూనె పైకి తేలే వరకు, గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కబడి, నూనె చక్కగా పైకి తేలిన తరువాత, తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇంట్లో దంచి పెట్టుకున్న అర టీస్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. వేడి వేడి అన్నంతో ఈ అద్భుతమైన మునక్కాడ మటన్ కర్రీ తింటే ఆ రుచే వేరు.

5 / 5
Follow Us