AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. వరుసగా మూడో రోజు ఢమాల్‌..!

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలుతున్నాయి. అక్టోబర్‌లో ఊహించిన దానికంటే అధికంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచింది. దీంతో డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపునకు ఆస్కారం ఏర్పడింది. సాధారణంగా, వడ్డీ రేట్ల..

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. వరుసగా మూడో రోజు ఢమాల్‌..!
Today Gold Prices
Subhash Goud
|

Updated on: Nov 13, 2026 | 6:29 AM

Share

Gold and Silver Prices: బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి శుక్రవారం భారీ ఊరటనిచ్చింది. నేడు, నవంబర్ 13న, బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం.. గత మూడు రోజులుగా ధరలను పరిశీలిస్తే 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 3 వేల వరకు దిగి వచ్చింది. వెండి కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,140 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధర రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,940 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,340 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. వ్యాపారుల ప్రకారం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది.

బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

అక్టోబర్‌లో ఊహించిన దానికంటే అధికంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచింది. దీంతో డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపునకు ఆస్కారం ఏర్పడింది. సాధారణంగా, వడ్డీ రేట్ల పెంపు అవకాశం బంగారం వంటి వడ్డీ రహిత ఆస్తులపై ఒత్తిడిని కలిగిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us