OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘రణబాలి’.. విజయ్-రష్మికల సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'రణబాలి'. దసరా కానుకగా రిలీజైన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టింది.

పెళ్లి తర్వాత టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇతర భాషల్లోనూ రణబాలి సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లోనూ అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. 1878 కాలంలో రాయలసీమలో సంభవించిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకుల ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో విలన్ గా నటించడం విశేషం. థియేటర్లలో సంచలన విజయం సాధించిన రణబాలి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 13 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే రణబాలి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విజయ్ -రష్మికల సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రణబాలి సినిమాను నిర్మించారు. విజయ్-రష్మికలతో పాటు ఈశ్వరీ రావు, మైమ్ మధు, రాజా రవీంద్ర, వినోద్ సాగర్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్–అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రణబాలి సినిమా కథ విషయానికొస్తే.. 1878 నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భద్ర మల్లన్న (లాల్) ఆశీర్వాదంతో రాజమ్మ (ఈశ్వరీరావు)కు పుట్టిన బిడ్డ రణబాలి (విజయ్ దేవరకొండ). పుట్టుకతోనే మృత్యువును జయించిన రణబాలికి కేవలం రెండు పుష్కరాల ఆయుష్షు మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువు విలయతాండవం చేస్తుంటుంది. ఏ మాత్రం దయ లేని బ్రిటిష్ కమీషనర్ థియోడర్ హెక్టర్ ( ఆర్నాల్డ్ వోస్లో) కరువు పరిస్థితుల్లోనూ ప్రజలపై పన్నుల భారం మోపుతూ, వారి వద్ద ఉన్న ధాన్యాన్ని బలవంతంగా లాక్కుంటాడు. మరి ఈ కరువు రాక్షసుడిని ఎదిరించి, ప్రజల ఆకలి తీర్చడానికి రణబాలి ఏ విధంగా పోరాడాడు? ఈ ప్రయాణంలో రణబాలి భార్య జయమ్ (రష్మిక) చేసిన త్యాగం ఏంటి? అనేది ఈ సినిమా కథ.
నెట్ ఫ్లిక్స్ లో రణబాలి..
#Ranabaali Now streaming on Netflix
Available: Telugu, Hindi, Tamil, Malayalam and Kannada
#VijayDeverakonda #RashmikaMandanna #Netflix https://t.co/t9MCZPrCtR
— Cinema Banisa (@Cinemabanisa_06) November 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




