ప్రస్తుతం పాయల్ రాధాకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఆమె చేతిలో కన్నడ చిత్రం 'భిన్న' ఉన్నట్లు తెలుస్తుంది
ఆదర్శ్ హెచ్. ఈశ్వరప్ప దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డిసెంబర్ 9 విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పాయల్ తన అవకాశాలను పెంచుకుంటోంది. 'ప్రసన్న వదనం' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
'చౌర్య పాఠం' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది. 'పాపం ప్రతాప్' సినిమాతో 2026లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమాలోనూ నటించి తన ఖాతాలో మరో చిత్రాన్ని చేర్చుకుంది. 'హ్యాపీ జర్నీ' సినిమాలో ఏడుగురు మహిళా ప్రధాన పాత్రలో పాయల్ కూడా ఒకరు.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకోవడానికి పాయల్ ఆసక్తి చూపిస్తోంది.
ఈ అమ్మడు రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులతో పాయల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.