AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 గంటలు నాన్​స్టాప్​గా పనిచేసే హెడ్​ఫోన్స్​.. చాలా తక్కువ ధరతో TRIGGR Punkheadz Z5.. వివరాలివే

వైర్‌లెస్ ఆడియో గాడ్జెట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం, ఆఫీస్ మీటింగ్‌లకు హాజరవడం వంటి అవసరాల కోసం చాలామంది బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న హెడ్‌సెట్ కొనాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో TRIGGR సంస్థ తక్కువ ధరలో Punkheadz Z5 వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు పలు ఆకర్షణీయమైన ఫీచర్లను ఇందులో అందిస్తోంది.

50 గంటలు నాన్​స్టాప్​గా పనిచేసే హెడ్​ఫోన్స్​.. చాలా తక్కువ ధరతో TRIGGR Punkheadz Z5.. వివరాలివే
Triggr Punkheadz Z5 Wireless Headphones
Nikhil
|

Updated on: Nov 13, 2026 | 6:20 AM

Share

Nair Black కలర్ ఆప్షన్‌లో లభించే Punkheadz Z5 వైర్‌లెస్ హెడ్‌సెట్‌లో 40mm డ్రైవర్లు, Bluetooth 6.0 కనెక్టివిటీ, 50 గంటల వరకు ప్లేబ్యాక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గేమర్స్ కోసం ప్రత్యేకంగా Gaming Modeను అందించారు. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే Dual Pairing ఫీచర్ కూడా ఉంది. కేవలం రూ.799 ధరలో లభిస్తున్న ఈ హెడ్‌సెట్ ఫీచర్లు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

సౌకర్యవంతమైన డిజైన్

TRIGGR Punkheadz Z5 హెడ్‌సెట్‌ను ఆన్-ది-ఇయర్ డిజైన్‌తో రూపొందించారు. చెవులపై ఒత్తిడి తగ్గించేలా సాఫ్ట్ కుషన్లను అందించారు. తక్కువ బరువుతో ఉండటంతో ఎక్కువసేపు ఉపయోగించేందుకు అనువుగా ఉంటుంది. Nair Black కలర్ వేరియంట్ క్లాసీ లుక్‌ను అందిస్తుంది.

సౌండ్ క్వాలిటీ కోసం ఇందులో 40mm డ్రైవర్లను ఉపయోగించారు. పాటలు వింటున్నప్పుడు స్పష్టమైన వాయిస్‌తో పాటు డీప్ బాస్ అనుభూతిని అందిస్తాయని సమాచారం. సినిమాలు చూసేటప్పుడు కూడా మెరుగైన ఆడియో అనుభవం పొందవచ్చు. గేమింగ్ కోసం ప్రత్యేకంగా Gaming Modeను అందించారు. దీన్ని ఆన్ చేస్తే ఆడియో లేటెన్సీ తగ్గి, గేమ్‌లో జరిగే చర్యలకు అనుగుణంగా సౌండ్ వినిపించేందుకు సహాయపడుతుంది.

Bluetooth 6.0 కనెక్టివిటీ

బ్యాటరీ విషయానికి వస్తే TRIGGR Punkheadz Z5 ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. దీంతో తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. కనెక్టివిటీ కోసం Bluetooth 6.0 టెక్నాలజీని అందించారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇందులో Dual Pairing ఫీచర్ కూడా ఉంది. ఒకేసారి రెండు వేర్వేరు డివైజ్‌లకు హెడ్‌సెట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్, ల్యాప్‌టాప్ మధ్య మారుతూ ఉపయోగించేవారికి సౌకర్యంగా ఉంటుంది. ధర విషయానికి వస్తే TRIGGR Punkheadz Z5 మార్కెట్లో కేవలం రూ.799కు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, గేమింగ్ మోడ్, డ్యూయల్ కనెక్టివిటీ కోరుకునేవారికి ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక.

Follow Us