AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 13 రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో తిరుగులేని పురోగతి

Horoscope Today (13 November 2026): శుక్రవారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు కనిపించనున్నాయి. మరికొందరికి కొత్త అవకాశాలు, శుభవార్తలు ఎదురుకానున్నాయి. కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి నవంబర్ 13 శుక్రవారం రాశిఫలాలను తెలుసుకోండి.

నవంబర్ 13 రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో తిరుగులేని పురోగతి
Rasi Phalalu 13 Nov 2027
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 13, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూలత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సానుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి రంగాలకు చెందినవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి నిపుణు లకు అవకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన వ్యవహారాలు, ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. పిల్లల వల్ల ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అనుకూలత బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలు, బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు బాగా బిజీగా సాగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అను కోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. కొందరు సహచరుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ప్రయాణాల్లో వీలైనంతగా అప్రమత్తంగా ఉండాలి. శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్త కుండా చూసుకోవాలి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలు స్వీకరించి లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవు తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుభవజ్ఞుల సహాయ సహకారా లతో వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడ తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన శుభవార్త అందుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు చేపట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి శుభకార్యానికి సంబం ధించిన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో కీలక వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబంలో ఒక దైవ కార్యం తలపెడతారు. పిల్లల్లో ఒకరికి సంబంధించి ఒక ముఖ్య మైన శుభవార్త అందుతుంది. మీ ఆలోచనలను, నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి ఇది సరైన కాలం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయా ణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబానికి సంబంధించిన కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులతో సమస్యలు సద్దుమణుగుతాయి. అవరోధాలు ఎదురైనప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలు, పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందు తారు. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లడం లేదా దైవ కార్యంలో పాల్గొనడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. అధికారులకు మీ సలహాలు ఉపయో గపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత పనులు, కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇత రుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కుటుంబంలో సామరస్య, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన కారణంగా కొద్దిగా శ్రమ, ఒత్తిడి అనుభవానికి వస్తాయి. పొరపాట్లు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని మిత్రుల సహాయంతో చక్కబెడ తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. ఆర్థిక, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో పాజిటివ్ గా వ్యవహరించడం మంచిది. ఓర్పు, సహనాలను అలవరచుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. వ్యాపార భాగ స్వాములతో వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us