AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు చూస్తారు!

Child Handwriting Tips Telugu: పిల్లల చేతిరాత బాగోలేదని పదేపదే రాయిస్తున్నారా? అయితే ఆ అలవాటు మానుకోండి. శిశువైద్య నిపుణురాలు సూచించిన ఈ 5 సులభమైన కార్యకలాపాలతో పిల్లల చేతి కండరాలను బలోపేతం చేసి, వారి చేతిరాత మెరుగుపడేలా చేయవచ్చు. అవేంటో వివరంగా తెలుసుకోండి.

మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు చూస్తారు!
Child Handwriting Tips Telugu
Rajashekher G
|

Updated on: Nov 12, 2026 | 11:21 PM

Share

Child Handwriting Tips Telugu: పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లల చేతిరాత అందంగా, స్పష్టంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, కొంతమంది పిల్లలు ఎన్నిసార్లు రాసినా వారి చేతిరాతలో పెద్దగా మార్పు కనిపించదు. దీంతో తల్లిదండ్రులు వారిని పదేపదే రాయమని ఒత్తిడి చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల చేతిరాత మెరుగుపడాలంటే ముందుగా వారి వేళ్లు, చేతుల్లోని చిన్న కండరాలు బలంగా ఉండాలని చెబుతున్నారు.

శిశువైద్య నిపుణురాలు సుమిత్ర మీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న వీడియోలో పిల్లల చేతిరాతను మెరుగుపరిచేందుకు ఐదు సులభమైన కార్యకలాపాలను వివరించారు. అవేంటో తెలుసుకుందాం.

1. ప్లేడోతో ఆడించండి

పిల్లలకు ప్లేడో లేదా బంకమట్టితో ఆడుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాటిని చేతులతో నొక్కడం, సాగదీయడం, చిన్న చిన్న ఆకారాలుగా తయారుచేయడం వల్ల వేళ్లు, చేతుల్లోని సూక్ష్మ కండరాలు బలపడతాయి. ఇది పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

2. చిన్న వస్తువులను ఏరేలా చేయండి

ఒక గిన్నెలో చిక్కుడు గింజలు, బీన్స్ లేదా ఇతర చిన్న వస్తువులను ఉంచండి. మరో ఖాళీ గిన్నె ఇచ్చి, మొదటి గిన్నెలోని వస్తువులను ఒక్కొక్కటిగా తీసి అందులో వేయమని చెప్పండి. అవసరమైతే చిన్న పట్టుకారు (ట్వీజర్) కూడా ఇవ్వవచ్చు. ఇలా చేయడం వల్ల బొటనవేలు, చూపుడు వేలు మధ్య పట్టుదల మెరుగుపడుతుంది.

3. బ్లాక్‌బోర్డుపై రాయించండి

కాగితంపై రాయించడం కంటే ముందుగా బ్లాక్‌బోర్డుపై అక్షరాలు, అంకెలు రాయించడం అలవాటు చేయండి. బోర్డుపై రాసేటప్పుడు పిల్లలు చేతులను పైకి ఎత్తాల్సి ఉంటుంది. దీనివల్ల భుజాలు, చేతుల కండరాలు బలపడటంతో పాటు చేతి కదలికలపై నియంత్రణ పెరుగుతుంది.

4. ఇసుక లేదా రవ్వలో అక్షరాలు రాయించండి

ఒక ట్రేలో పలుచగా ఇసుక, బొంబాయి రవ్వ లేదా ఉప్పు పరచండి. అందులో పిల్లల చేతి వేళ్లతో అక్షరాలు, అంకెలు, వివిధ ఆకారాలు గీయించండి. ఈ సరదా కార్యకలాపం వల్ల వేళ్ల కదలికలపై నియంత్రణ పెరుగుతుంది.

5. సరైన భంగిమలో కూర్చోవడం నేర్పండి

మంచి చేతిరాతకు సరైన కూర్చునే విధానం కూడా ముఖ్యమే. రాసేటప్పుడు పిల్లలు నిటారుగా కూర్చునేలా చూడాలి. వీపునకు తగిన ఆధారం ఉండాలి. రెండు పాదాలు నేలపై ఆనాలి. అలాగే బల్ల, కుర్చీ ఎత్తు పిల్లలకు సరిపోయేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల వారు సౌకర్యంగా కూర్చొని ఎక్కువసేపు రాయగలుగుతారు.

పిల్లలపై ఒత్తిడి చేయకండి!

ఈ ఐదు కార్యకలాపాలను ప్రతిరోజూ కొద్దిసేపు సరదాగా చేయించడం ద్వారా పిల్లల చేతి కండరాల అభివృద్ధికి తోడ్పడవచ్చు. అయితే, చేతిరాత బాగోలేదని పిల్లలను తిట్టడం, గంటల తరబడి రాయమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. వారిని ప్రోత్సహిస్తూ, ఆటల రూపంలో నేర్పించాలి. ముఖ్యంగా ప్రతి చిన్న మెరుగుదలనూ అభినందించాలి. ఇలా ఓపికగా ప్రోత్సహిస్తే పిల్లల్లో రాయడంపై ఆసక్తి పెరిగి, క్రమంగా చేతిరాత కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.

వీడియో చూడండి..

Follow Us
మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు
మీ పిల్లల చేతిరాత అందంగా లేదా? ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే మార్పు
పదేపదే పీడకలలు వస్తున్నాయా? మీ మనసులోని ఆందోళనలకు ఇవే సంకేతాలు..
పదేపదే పీడకలలు వస్తున్నాయా? మీ మనసులోని ఆందోళనలకు ఇవే సంకేతాలు..
'రామాయణ' ప్రభంజనం.. కేవలం 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో..
'రామాయణ' ప్రభంజనం.. కేవలం 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో..
తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరించిన రాజు ఎవరో తెలుసా?..
తిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరించిన రాజు ఎవరో తెలుసా?..
చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
టీనేజర్ల ట్రాఫికింగ్‌.. హార్మోన్ల ఇంజెక్టింగ్‌.. అండాల సేకరణలో..
టీనేజర్ల ట్రాఫికింగ్‌.. హార్మోన్ల ఇంజెక్టింగ్‌.. అండాల సేకరణలో..
పైకి చూస్తే పేపర్ లామినేట్ రోల్స్.. లోపల చెక్‌ చేయగా..
పైకి చూస్తే పేపర్ లామినేట్ రోల్స్.. లోపల చెక్‌ చేయగా..
నిజంగా జరిగిన కథ.. OTTలో ఒళ్లు గగుర్పొడిచే రియల్ మిస్టరీ స్టోరీ
నిజంగా జరిగిన కథ.. OTTలో ఒళ్లు గగుర్పొడిచే రియల్ మిస్టరీ స్టోరీ
కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహంతో..
కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహంతో..
అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకున్నానని ఏడ్చేశా..
అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకున్నానని ఏడ్చేశా..