ఇంట్లో ఈ బొమ్మలు పెడితే డబ్బే డబ్బు.. అదృష్టం మీ వెంటే!
మన ఇల్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఇళ్లలో ఎన్నో రకాల అందమైన అలంకరణ వస్తువులు, చిత్రాలను ఏర్పాటు చేస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం గోడలకు ఏర్పాటు చేసే పెయింటింగ్స్‌కు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించడంతో పాటు, ఆర్థిక అభివృద్ధి, అదృష్టం మరియు సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంట సిరులు వెల్లివిరియడానికి సహాయపడే ఆ ముఖ్యమైన చిత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

నీటి ప్రవాహం:
ఇంట్లో నీటి ప్రవాహం లేదా జలపాతం ఉన్న చిత్రాన్ని అమర్చడం సంపదకు, నిరంతర ప్రవాహనికి ప్రతీకగా భావిస్తారు. దీనిని ఉత్తర లేదా ఈశాన్య దిశలో తగిలించడం ద్వారా ఇంట్లో ఆర్థిక లోటు ఉండదని నమ్ముతారు.
ఏడు గుర్రాల చిత్రం:
వాస్తు శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన చిత్రాలలో ఇది ఒకటి. పరుగెత్తుతున్న ఏడు గుర్రాల పెయింటింగ్ వ్యాపారంలో అభివృద్ధిని, జీవితంలో విజయాలను వేగంగా ఆకర్షిస్తుంది. దీనిని తూర్పు లేదా ఉత్తర దిశలో తగిలించడం చాలా శుభప్రదం.
మనీ ట్రీ లేదా బంగారు నాణేలు:
డబ్బును, సంపదను ఆకర్షించే వాటిలో మనీ ట్రీ లేదా బంగారు నాణేల చిత్రాలు ప్రముఖమైనవి. ఇవి ఆర్థిక వృద్ధికి, భవిష్యత్తు భద్రతకు సంకేతంగా నిలుస్తాయి. వీటిని దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది.
ఉదయించే సూర్యుడు :
ఉదయించే సూర్యుని పెయింటింగ్ సరికొత్త ప్రారంభాలను, కెరీర్ పరంగా ఎదుగుదలను సూచిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపార వృద్ధి కోసం దీనిని తూర్పు దిశలో అమర్చడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
కొయ్ ఫిష్, నెమలి:
నీటిలో ఈదుతున్న కొయ్ ఫిష్ చిత్రాలు సంపదను, అదృష్టాన్ని ఇస్తాయి. వీటిని ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే, అందానికి, సానుకూలతకు ప్రతీక అయిన నెమలి చిత్రాన్ని తూర్పు-ఈశాన్య దిశలో ఉంచితే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
మూంగిల్ అడవి, ఏనుగు:
పచ్చని మూంగిల్ అడవి చిత్రం స్థిరమైన వృద్ధిని, దీర్ఘకాలిక శ్రేయస్సును సూచిస్తుంది. అలాగే శక్తికి, జ్ఞానానికి ప్రతీక అయిన ఏనుగు చిత్రాన్ని ఉత్తర దిశలో అమర్చడం ద్వారా సిరులు ఇంట నిలుస్తాయి.
చేయకూడని పొరపాట్లు:
ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాలు, హింస, దుఃఖం లేదా వృద్ధాప్యం, ఎండిపోయిన చెట్లు ఉన్న చిత్రాలను పెట్టకూడదు. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)