AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vijay Sai: తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? 37 ఏళ్ల వయసులోనే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా చిన్న వయసులో చనిపోయిన ప్రతిభావంతులైన నటుల్లో విజయ్ సాయి ఒకరు. హీరోగా, కమెడియన్‌గా, సహాయక నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఇతను కేవలం 37 ఏళ్ల వయసులోనూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

Actor Vijay Sai: తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? 37 ఏళ్ల వయసులోనే..
Actor Vijay Sai
Basha Shek
|

Updated on: Nov 12, 2026 | 9:13 PM

Share

విజయ్ సాయి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే ఓ అమాయకమైన ముఖం కళ్ల ముందు మెదులుతుంది. నేటి తరం ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. 90’s జనరేష్ ప్రేక్షకులకు విజయ్ సాయి బాగా గుర్తుండే ఉంటాడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విజయ్. హీరోగానూ, హీరో ఫ్రెండ్ గానూ, కమెడియన్ గానూ, సహాయక నటుడిగానూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఏ పాత్ర చేసినా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు విజయ్. 2000లో తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్. అందులో హీరో తరుణ్ స్నేహితుడి పాత్రలో కనిపించాడు. ఆ మరుసటి ఏడాదే డైరెక్టర్ రవి బాబు తెరకెక్కించిన ‘అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో సెకెండ్ హీరోగా చేశాడు. దీంతో పాటు బ్యాక్ పాకెట్ అనే సినిమాలోనూ హీరోగా చేశాడు విజయ్. ఒకరికి ఒకరు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, యూత్, భగీరథ, సోగ్గాడు, బొమ్మరిల్లు, పార్టీ, ఆరోజే, పైసాలో పరమాత్మ, మంత్ర, కొంటె కుర్రాళ్లు, ఏకలవ్యుడు, కరెంట్, తాజ్ మహల్, డాన్ శీను, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, డాన్ సీను, ఓమ్ త్రీడీ తదితర సినిమాల్లో కమెడియన్ గా, సహాయ క నటుడిగా కనిపించాడు విజయ్.

ఓవరాల్ గా తన సినిమా కెరీర్ లో సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించాడు విజయ్. కాగా సినిమాల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే విజయ్ నిజ జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. పెళ్లి, విడాకుల వార్తలతో పలు సార్లు వార్తల్లో నిలిచాడు విజయ్. మొదట 2006లో బుల్లితెర నటి వనితా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విజయ్. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. 2015 నుంచే ఇద్దరూ వేర్వేరుగా జీవించడం మొదలు పెట్టారు. అయితే ఇది జరిగిన రెండేళ్లకే అంటే 2017లో తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్. తను ఉంటోన్న రూమ్ లోనే సీలింగ్ ఫ్యాన్‌ కు ఉరేసుఉని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే నాటికి విజయ్ వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే.

కాగా విజయ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది వనితా రెడ్డి. ‘ పెళ్లి కాకముందే విజయ్ కు మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది. కానీ ఆ విషయం నా వద్ద దాచి పెట్టాడు. అప్పుడే విజయ్ పై నా మనసు విరిగిపోయింది. నా స్థానంలో ఇంకొకరిని తీసుకు వచ్చినప్పుడు ఇంకా అతని ముఖం కూడా చూడాలనుకోలేదు. అంతేకాదు నన్ను బాగా హింసించాడు. అతని వేధింపులు భరించలేకనే 2013లోనే విడాకులకు అప్లై చేశాను. అప్పటికే మాకు ఓ పాప ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతివారం పాపను అతనికి చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు అతనితో ఉండేది. అయితే విజయ్ ఇలా చేస్తాడనుకోలేదు. విజయ్ చనిపోయినప్పుడు అతనిని పట్టుకుని ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండెలవిసేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి’ అంటూ వాపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us