AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధతిలో కొత్తవాటిలా మార్చండి!

వంటగదిలో అత్యధికంగా ఉపయోగించే వస్తువులలో గ్యాస్ స్టవ్ ఒకటి. అయితే రోజూ వంట చేసేటప్పుడు పడే నూనె తుంపర్లు, మసాలాలు, వేడి ఆవిరి కారణంగా గ్యాస్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పేరుకుపోతుంటాయి. వీటిని శుభ్రం చేయడం చాలా మందికి ఒక పెద్ద సవాల్‌గా అనిపిస్తుంది. సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే గ్యాస్ నాబ్స్‌ను చాలా సులభంగా కొత్తవాటిలా మెరిపించవచ్చు.

గ్యాస్ స్టవ్ నాబ్స్‌పై జిడ్డు, మురికి పట్టిపోయాయా? ఈ సులభమైన పద్ధతిలో కొత్తవాటిలా మార్చండి!
Gas Stove Knobs Cleaning,
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2026 | 7:03 PM

Share

ఇంట్లో వంటగది ఎంత శుభ్రంగా ఉంటే, ఆరోగ్యం అంత సురక్షితంగా ఉంటుంది. మనం రోజూ వంట చేయడానికి ఉపయోగించే గ్యాస్ స్టవ్‌ను పైన కనిపించే భాగాన్ని శుభ్రం చేసినప్పటికీ, తరచుగా దాని నాబ్స్‌ను శుభ్రం చేయడం మర్చిపోతుంటాం. వంట చేసే సమయంలో చేతుల నూనె, కూరల తుంపర్లు, మసాలాలు, ఆవిరి కారణంగా గ్యాస్ నాబ్స్‌పై జిడ్డు, మురికి త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల అవి చూడటానికి మురికిగా ఉండటమే కాకుండా జామ్ అయిపోతుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి ఎలాంటి ఖరీదైన క్లీనర్లు అవసరం లేదు. కొన్ని సులభమైన ఇంట్లోని పదార్థాలతో గ్యాస్ నాబ్స్‌ను ఎలా మెరిపించాలో ఇప్పుడు చూద్దాం.

స్టెప్-బై-స్టెప్ క్లీనింగ్ ప్రాసెస్:

గ్యాస్ ఆఫ్ చేసి నాబ్స్ తొలగించండి:

సఫాయ్ చేసే ముందు గ్యాస్ రెగ్యులేటర్ పూర్తిగా బంద్ చేసి, స్టవ్ చల్లగా ఉండేలా చూసుకోండి. సాధారణంగా గ్యాస్ నాబ్స్‌ను తేలికగా లాగితే అవి సులభంగా వచ్చేస్తాయి. ఒకవేళ బిగుతుగా ఉంటే బలవంతంగా లాగకుండా మెల్లగా కదిలించి బయటకు తీయాలి.

వేడి నీటిలో నానబెట్టాలి:

ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో తగినంత లిక్విడ్ డిష్ సోప్ కలపండి. ఇప్పుడు బయటకు తీసిన గ్యాస్ నాబ్స్‌ను ఆ నీటిలో వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకున్న గట్టి జిడ్డు, నూనె పొరలు మెత్తబడతాయి. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపితే జిడ్డు మరింత త్వరగా వదిలిపోతుంది.

ఇవి కూడా చదవండి

బ్రష్‌తో శుభ్రం చేయడం:

నానిన తర్వాత పాత టూత్‌బ్రష్‌ సహాయంతో నాబ్స్ మూలలను, సందులను శుభ్రంగా రుద్దాలి. ఒకవేళ మొండి జిడ్డు ఉంటే, కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి నాబ్స్‌కు రాయాలి. ఐదు నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి మొత్తం సులభంగా తొలగిపోతుంది. చిన్న సందుల కోసం టూత్‌పిక్ ఉపయోగించవచ్చు.

ఆరబెట్టి అమర్చడం:

శుభ్రం చేసిన నాబ్స్‌ను సాధారణ నీటితో కడిగి, పొడి గుడ్డతో బాగా తుడవాలి. పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని మళ్లీ గ్యాస్ స్టవ్‌కు అమర్చాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us