AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలా? ఈ 5 సింపుల్‌ వంటింటి చిట్కాలు పాటించండి

ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఆపిల్‌ను కోసి కొద్దిసేపు అలాగే ఉంచితే అది వెంటనే గోధుమ రంగులోకి లేదా నల్లగా మారుతుంది. దీనివల్ల చాలామంది వాటిని తినడానికి ఇష్టపడరు. ఆపిల్‌లో ఉండే పాలిఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరపడం వలనే ఈ మార్పు జరుగుతుంది. కోసిన ఆపిల్ ముక్కలు గంటల తరబడి తాజావిగా, తెల్లగా ఉండేలా చేయడానికి కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలా? ఈ 5 సింపుల్‌ వంటింటి చిట్కాలు పాటించండి
Apple Browning Prevention
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2026 | 9:50 PM

Share

ఆపిల్ కట్ చేసిన కొద్దిసేపటికే గాలిలోని ఆక్సిజన్‌తో రియాక్ట్ అయి నల్లగా మారుతుంటాయి. అలా జరగకుండా తాజాగా, తెల్లగా ఉండేలా చూసుకోవడానికి కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు సహాయపడతాయి. కట్ చేసిన ఆపిల్ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం పిండడం లేదా ఉప్పునీటిలో కొన్ని నిమిషాలు ఉంచడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. అలాగే తేనె కలిపిన నీటిలో లేదా సాధారణ చల్లని నీటిలో ముంచడం ద్వారా ఆపిల్ సహజమైన తాజాదనం కోల్పోకుండా ఉంటుంది. పిల్లల బాక్సుల్లో పెట్టేందుకు లేదా స్నాక్స్ కోసం కోసిన ఆపిల్ ముక్కలు తాజాగా ఉండేలా ఈ సులభమైన పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి.

నిమ్మరసం

ఆపిల్ ముక్కలు నల్లబడకుండా నిరోధించడానికి నిమ్మరసం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. కట్ చేసిన ఆపిల్ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసం పిండాలి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం ఆక్సిడేషన్ ప్రక్రియను నివారించి ఆపిల్ రంగు మారకుండా కాపాడుతుంది.

ఉప్పు నీరు

ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి, అందులో కట్ చేసిన ఆపిల్ ముక్కలను 3 నుండి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని సాధారణ నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు నీరు ఆపిల్ ముక్కలపై ఒక రక్షణ పొరలా ఏర్పడి నల్లబడకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

తేనె నీరు

ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి, ఆ మిశ్రమంలో ఆపిల్ ముక్కలను కొన్ని నిమిషాల పాటు నానబెట్టాలి. తేనెలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఎంజైమ్ చర్యను అడ్డుకుంటాయి. దీనివల్ల ఆపిల్ ముక్కల రుచి మారకుండా తాజాగా ఉంటాయి.

చల్లని నీటిలో ముంచడం

ఆపిల్ ముక్కలను కోసిన వెంటనే చల్లటి నీటిలో లేదా ఐస్ క్యూబ్స్ వేసిన నీటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి. ఇది గాలి తగలకుండా అడ్డుకుని ఆపిల్ ముక్కల రంగు పాడవకుండా తాజాదనాన్ని కాపాడుతుంది.

రబ్బర్ బ్యాండ్ లేదా గాలి చొరబడని డబ్బా

ఆపిల్‌ను ముక్కలుగా కోసిన తర్వాత మళ్లీ దాని ఆకారంలో ఉంచి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టాలి. దీనివల్ల గాలి తగిలే ఉపరితలం తగ్గి త్వరగా నల్లబడవు. అలాగే గాలి చొరబడని బాక్సుల్లో నిల్వ చేయడం వల్ల కూడా ఇవి తాజాగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us