మళ్లీ కనిపించవేమో.. ప్రపంచంలో అంతరించి పోతున్న వింతైన పువ్వులివే!
samatha
12 November 2026
Pic credit - Pinterest
పువ్వులు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ పూలు అంటే ఇష్టం ఉంటుంది. ఇక ప్రకృతిలో అనేక రకాల పువ్వులు ఉన్నాయి.
పువ్వులు
అందులో కొన్ని రకాల అందమైన పువ్వులు అంతరించి పోయే దశలో ఉన్నాయంట. వాతావరణ మార్పులు, అడవులు నశించడం పలు కారణాల వలన అవి కనుమరుగైపోతున్నాయంట.
అందమైన పువ్వులు
గోస్ట్ ఆర్కిడ్ ఇది చాలా అరుదైన ఆకర్షణీయమైన పువ్వు. ఇది ఈ మొక్కకు ఆకులు ఉండవు. తెలుపు రంగులో పూలు పూస్తుంది. అంతరించి పోతున్న వాటిలో ఇది కూడా ఒకటి. ఇది అడవుల్లో ఉంటుంది.
గోస్ట్ ఆర్కిడ్
జేడ్ వైన్ ఫిలిప్పీన్స్ పువ్వు చాలా అందమైనది. ఇది బ్లూ కలర్‌లో ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. అడవుల్లో పూసే పువ్వు ఇది.
జేడ్ వైన్ ఫిలిప్పీన్స్
చాలా అందంగా ఉండే పూలలో మిడిల్ మిస్ట్ రెడ్ ఒకటి. ఈ పువ్వు మొక్కలు ప్రపంచంలో కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయంట. అంతరించి పోతున్న వాటిలో ఇది ఒకటి.
మిడిల్ మిస్ట్ రెడ్
సాయంత్రం పూట వికసించే, చాక్లెట్ సువాసన గల అందమైన పువ్వు చాక్లెట్ కాస్మోస్ . ఈ పువ్వు దాదాపు పూర్తిగా అంతరించి పోయింది.
చాక్లెట్ కాస్మోస్
చిలుక ముక్కు ఆకారాన్ని పోలి ఉండే పారెట్ బీక్ కార్ప్స్ ఫ్లవర్స్ చూడటానికి బాగుంటాయి. ఇవి అంతరించి పోయే దశలో ఉన్నాయి
పారెట్ బీక్ కార్ప్స్ ఫ్లవర్స్
నల్ల గబ్బిలం పువ్వు, అదే విధంగా రాఫ్లేసియా వంటి పూలు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ముఖ్యంగా తంగేడు పువ్వు కూడా అంతరించి పోయే ప్రమాదం ఉన్నదంట.