AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే తప్పులు తెలుసుకోండి

భారతీయుల దినచర్యలో టీతోనే ఉదయం ప్రారంభమవుతుంది. చాలామందికి రోజులో ఎప్పుడెప్పుడూ టీ తాగాలనిపిస్తుంది. అయితే చాలా మంది సరైన పద్ధతిలో టీ తయారు చేయకపోవడం వల్ల దాని అసలు రుచి రాదు. దాదాపు 90 శాతం మంది టీ చేసేటప్పుడు ముందుగా ఏం వేయాలనే దానిపై గందరగోళానికి గురవుతుంటారు. పరిపూర్ణమైన రుచికరమైన టీ తయారీకి సరైన విధానం పాటించడం ముఖ్యం. ముందుగా నీటిని బాగా మరిగించి, అందులో అల్లం, యాలకులు వేయాలి. ఆ తర్వాతే టీపొడి, పంచదార వేసి మరిగించిన తర్వాత పాలు కలపాలి. ఇలా చేయడం వల్ల టీ మంచి అరోమా, పర్‌ఫెక్ట్ టేస్ట్‌ను ఇస్తుంది.

పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే తప్పులు తెలుసుకోండి
Perfect Tea
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2026 | 8:11 PM

Share

మన దేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది కోట్ల మంది భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామందికి టీ తాగడం అలవాటు. స్నేహితులతో కబుర్లు చెప్పాలన్నా, అలసటను క్షణంలో దూరం చేసుకోవాలన్నా ఒక కప్పు వేడి వేడి టీ సరిపోతుంది. అయితే రోజూ మనం ఎంతో ఇష్టంగా తాగే టీ కొన్నిసార్లు సరిగ్గా కుదరదు. దీనికి కారణం టీ తయారీలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. దాదాపు 90 శాతం మందికి టీ చేసేటప్పుడు నీరు, పాలు, టీపొడి, పంచదార ఏ క్రమంలో వేయాలో సరైన అవగాహన ఉండదు. పర్‌ఫెక్ట్ టీ తయారీకి అనుసరించాల్సిన సరైన పద్ధతి ఇక్కడ చూద్దాం.

టీ చేసే సరైన విధానం:

చాలా మంది నేరుగా గిన్నెలో పాలు పోసి టీ పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీటిని పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో కచ్చపచ్చగా దంచిన అల్లం, యాలకులు వేయాలి. వీటిని 3 నుంచి 4 నిమిషాల పాటు నీటిలో బాగా మరగనివ్వడం వల్ల వాటి సువాసన, సారం నీటిలోకి పూర్తిగా దిగుతుంది. ఆ తర్వాత తగినంత టీపొడి, పంచదార వేయాలి. వీటిని కూడా మరో కొన్ని నిమిషాలు నీటితో పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల టీ మంచి రంగును సంతరించుకుంటుంది. చివరగా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పాలను కలపాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన వెంటనే చల్లటి పాలను పోయకూడదు. పాలు పోశాక టీని మీడియం మంటపై చక్కగా మరిగించాలి. మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే టీ మంచి చిక్కదనంతో రుచిగా వస్తుంది.

పాటించాల్సిన కొన్ని చిట్కాలు:

అల్లాన్ని తురుముకోవడం కంటే దంచి వేయడం వల్ల టీకి మంచి రుచి వస్తుంది. పాలు పోసిన తర్వాత టీని ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు. సరైన కొలతలు, సరైన క్రమాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లోనే హోటల్ స్టైల్ కడక్ ఛాయ్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న మార్పులతో మీ రోజువారీ టీ రుచి అద్భుతంగా మారుతుంది!

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే
పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా
ముచ్చింతల్‌లో ఐదు రోజుల ఆధ్యాత్మిక సంబరం.. యతీంద్ర సప్తతిలో..
ముచ్చింతల్‌లో ఐదు రోజుల ఆధ్యాత్మిక సంబరం.. యతీంద్ర సప్తతిలో..
వైట్ హౌస్ సమీపంలో షూటింగ్.. నలుగురు మృతి!
వైట్ హౌస్ సమీపంలో షూటింగ్.. నలుగురు మృతి!
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో..
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
ఇవి చెక్‌ చేయకుండా హెల్మెంట్ కొంటే.. మీ డబ్బులు వేస్ట్‌
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..
పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్..