AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: శుక్రుడి అనుగ్రహం..వీరి బ్యాంక్ బ్యాలెన్స్‌ పెరగడం పక్కా..!

Venus Transit 2026: ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. నవంబర్ 22 వరకు అక్కడే కొనసాగుతాడు. శుక్రుడి కన్యా రాశి సంచారం వల్ల వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Money Astrology: శుక్రుడి అనుగ్రహం..వీరి బ్యాంక్ బ్యాలెన్స్‌ పెరగడం పక్కా..!
Money Astrology 2026
Janardhan Veluru
|

Updated on: Nov 12, 2026 | 3:19 PM

Share

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని సంపద, సుఖసంతోషాలు, విలాసాలు, ప్రేమ, సౌందర్యానికి కారకుడిగా భావిస్తారు. శుక్రుడి రాశి మార్పు వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, వృత్తి, వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 6న కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు.. నవంబర్ 22 వరకు అక్కడే కొనసాగనున్నాడు. ఈ సమయంలో ఐదు రాశుల వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. శుక్రుడి ఈ సంచారం వల్ల వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, నిలిచిపోయిన పనులు పూర్తికావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని చెబుతున్నారు.

వృషభ రాశి (Taurus)

శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా ఉపశమనం కలిగే అవకాశముంది. చాలాకాలంగా ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో చేపట్టే పనులపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో ఎక్కడైనా డబ్బు నిలిచిపోయి ఉంటే అది తిరిగి చేతికి అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు పాత పరిచయాల ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి.

సింహ రాశి (Leo)

సింహ రాశి వారికి నవంబర్ 22 వరకు అనేక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. చాలాకాలంగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా మారుతుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఖర్చులు, పొదుపు మధ్య సరైన సమతుల్యత సాధించగలుగుతారు.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి (Virgo)

కన్యా రాశిలోనే శుక్రుడు సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వీరి మాటలకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. గతంలో వేసుకున్న ప్రణాళికల ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారికి నవంబర్ 22లోపు ఆర్థికంగా మంచి ఉపశమనం లభిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. చాలాకాలంగా ఆటంకాలు ఎదుర్కొంటున్న పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. దీనివల్ల పని ఒత్తిడి పెరిగినప్పటికీ భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. డబ్బు కొరత కారణంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశి వారికి శుక్రుడి సంచారం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో ఈ పరిచయాలు వృత్తిపరంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ప్రాజెక్టుల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర అంచనాల ఆధారంగా అందించిన సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ అంశాలు నిజమని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు.

Follow Us