AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టీనేజర్ల ట్రాఫికింగ్‌.. హార్మోన్ల ఇంజెక్టింగ్‌.. అండాల సేకరణలో.. మాఫియా ఆగడాలు..!

సంతానం లేని దంపతుల బలహీనతే పెట్టుబడిగా, పేద యువతుల నిస్సహాయతే రాబడిగా హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చీకటి సామ్రాజ్యమే ఈ అండాల మాఫియా. ఒకరి ఇంట్లో అమ్మతనం వెలుగులు నింపే పవిత్రమైన ఐవీఎఫ్ ప్రక్రియను కొందరు కేటుగాళ్లు, ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్లు కలిసి అత్యంత ప్రమాదకరమైన వ్యాపారంగా మార్చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమాయక యువతులను రప్పించి, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి, ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లతో వారి జీవితాలను చిదిమేస్తున్న ఈ చీకటి దందా గుట్టును ఇటీవలి పోలీస్ రెయిడ్స్ బట్టబయలు చేశాయి. ART చట్టం ఏం చెబుతోంది? ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? తెలుసుకుందాం..

Hyderabad: టీనేజర్ల ట్రాఫికింగ్‌.. హార్మోన్ల ఇంజెక్టింగ్‌.. అండాల సేకరణలో.. మాఫియా ఆగడాలు..!
Illegal Egg Donation Racket Hyderabad
Krishna S
|

Updated on: Nov 12, 2026 | 10:02 PM

Share

పెళ్లి చేసుకోకపోయినా.. ఈ సమాజం యాక్సెప్ట్‌ చేస్తుంది గాని.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే దారుణంగా అవమానిస్తుంది. దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగుతున్నా.. పిల్లలు లేరంటే.. అందరి దగ్గరా చిన్నబోవాల్సి వస్తుంది. దారినబోయే దానయ్య సైతం సంతానం లేకుంటే వెక్కిరించి వెళ్తాడు. అంతెందుకు.. సొంత కుటుంబీకులే నానా మాటలు అని పోతారు. ఇన్ని ఒత్తిడుల మధ్య ఆ దంపతులు డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు. అక్కడ మొదలువుతుంది అసలు కథ. ఆ దంపతులపై ఉండే ఒత్తిడి, పిల్లల్ని కనాలనే ఆశ… ఎంత డబ్బైనా ఖర్చుపెడతామన్న హామీల మధ్య.. IVF సెంటర్‌లోకి అడుగుపెడతారు. అక్కడి నుంచి మొదలయ్యే ఈ ఇండస్ట్రీ.. పైకి ఒకలా.. వెనుక మరోలా కనిపిస్తుంది. IVF క్లినిక్స్‌ దగ్గర కాచుకుని ఉండే దళారులు తెగబడతారు. దంపతులను ప్రలోభపెడతారు.. పిల్లలు పక్కా అనే హామీలు ఇచ్చేస్తారు. దంపతుల బలహీనతే వీళ్ల పెట్టుబడి. వారి కోరికలే.. వీరి రాబడి. సక్రమ పద్దతిలో తమకు పిల్లలు పుడితే ఓకే.. పుట్టకపోయినా ఓకే అనుకునే జంటలు ఇలాంటి వారిని రిజెక్ట్‌ చేస్తుంటాయి. మాకు ఎలాగైనా పిల్లలు కావాలనే జంటల్ని గట్టిగా పట్టేసుకుంటుంది ఈ మాఫియా. అలా మొదలయ్యే బిజినెస్‌.. రోజుకు వెయ్యి రెండు వేల నుంచి మొదలై.. చివరికి లక్షల్లో లాగిపడేసే వరకు వెళ్తుంది. పిల్లలు పుట్టాలంటే.. సహజంగా జరిగే ప్రక్రియ చాలా తక్కువ సమయమే. పురుషుడి నుంచి మహిళలోకి వెళ్లే లక్షలాది శుక్రకణాలు.. అండాశయం నుంచి విడుదలైన అండం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి