Bangarraju: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న బంగార్రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కుర్రహీరోలకు గట్టి పోటీ ఇవ్వడంలో ముందుంటారు కింగ్ నాగార్జున.. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు నాగ్.
Bangarraju: కుర్రహీరోలకు గట్టి పోటీ ఇవ్వడంలో ముందుంటారు కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna).. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు నాగ్. ఇక నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ్ తోపాటు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya )కూడా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. నిజానికి కరోనా లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కఠిన ఆంక్షలు విధిస్తారో తెలియని అనుమానాల నేపథ్యంలో ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బంగార్రాజు టీమ్. తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పి మరీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున. సొగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతిశెట్టి, నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలైన 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మూవీని విడుదల చేయనున్నారు. బంగార్రాజు సినిమాను ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ చేయన్నారని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :