Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన చైన్‌ స్నాచర్‌.. ఆతర్వాత ఏమైందంటే..

అతనొక చైన్‌ స్నాచర్‌ (Chain Snatcher) . ఒక మహిళ ఒంటరిగా వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వ్యక్తి వచ్చి ఆమె మెడలో చైన్ లాక్కొని పారిపోయాడు.

Anantapur: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన చైన్‌ స్నాచర్‌.. ఆతర్వాత ఏమైందంటే..
Chain Snatcher
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2022 | 8:34 AM

అతనొక చైన్‌ స్నాచర్‌ (Chain Snatcher) . ఒక మహిళ ఒంటరిగా వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వ్యక్తి వచ్చి ఆమె మెడలో చైన్ లాక్కొని పారిపోయాడు. వెంటనే ఆ బాధిత మహిళ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ కోసం గాలింపు చేపట్టారు. అలా గాలిస్తుండగా ఓ చెరువు గట్టుపై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు వెంబడించారు. వారిని రావడం చూసి దొంగ కూడా తప్పించుకోవాలనుకున్నాడు. వెంటనే చెరువులోకి దూకేసాడు. మమ్మల్ని చూసివీడెందుకు చెరువులో దూకాడా? అని అనుమానమొచ్చిన పోలీసులు అతనిని చెరువులోంచి బయటకు తీసుకొచ్చారు. వివరాలు ఆరా తీయగా అతనే చైన్‌ స్నాచర్‌ అని తేలింది. ఇది సినిమా సీన్ కాదు.. నిజంగా జరిగిన వాస్తవం. అనంతపురం (Anantapur) నగర సమీపంలో ఈ  సంఘటన జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండంల రేకులకుంట గ్రామ సమీపంలో ఒక మహిళ.. నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి వచ్చి ఆమె మెడలో చైన్ లాక్కెళ్లి పారిపోయాడు. వెంటనే తేరుకున్న మహిళ ఫోన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. నగర సమీపంలోని చెరువు కట్ట పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి అక్కడ కనిపించాడు. వెంటనే పోలీసులు వెంబడించగా చెరువులో దూకేసాడు. పోలీసులు అతన్ని బయటకు లాక్కొచ్చారు. అప్పుుడు తెలిసింది.. అతనే చైన్ స్నాచర్ అని. అంత రిస్క్ చేసి చేసిన చైన్ స్నాచింగ్ వృథా అయింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

Also Read:Sivakarthikeyan: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..

Mughal Garden: మొఘల్ గార్డెన్స్ లో సందర్శకులకు అనుమతి.. తేదీలు, మార్గదర్శకాలు ఏమిటంటే..

Son of India Trailer: ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది.. సన్నాఫ్ ఇండియా ట్రైలర్