Mughal Garden: మొఘల్ గార్డెన్స్ లో సందర్శకులకు అనుమతి.. తేదీలు, మార్గదర్శకాలు ఏమిటంటే..

ప్రజల సందర్శనార్ధం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు మొఘల్ గార్డెన్స్(Mughal Gardens) తెరిచి ఉంటుందని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది....

Mughal Garden: మొఘల్ గార్డెన్స్ లో సందర్శకులకు అనుమతి.. తేదీలు, మార్గదర్శకాలు ఏమిటంటే..
Untitled 1
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 11, 2022 | 7:59 AM

ప్రజల సందర్శనార్ధం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు మొఘల్ గార్డెన్స్(Mughal Gardens) తెరిచి ఉంటుందని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అడ్వాన్స్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే సందర్శకులను అనుమతిస్తామని తెలిపింది. కరోనా జాగ్రత్తల్లో భాగంగా గతేడాది వర్తించిన నిబంధనలు ప్రస్తుతం కూడా కొనసాగుతాయని పేర్కొంది. వాక్-ఇన్ ఎంట్రీ అందుబాటులో ఉండదని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో వార్షిక ‘ఉద్యానోత్సవ్’ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. ఫిబ్రవరిలో దశలవారీగా వికసించే 11 రకాల తులిప్స్ పూలు ఉద్యానోత్సవ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతే కాకుండా సెంట్రల్ లాన్‌లలో అద్భుతమైన డిజైన్‌లలో ఫ్లవర్ కార్పెట్‌లనూ ప్రదర్శించనున్నారు.

మొఘల్ గార్డెన్స్ సందర్శనకు మార్గదర్శకాలు:

1) ఫిబ్రవరి 12, 2022 నుంచి మార్చి 16, 2022 వరకు తెరిచి ఉంటుంది.

2) వెయ్యి గంటల నుంచి 1700 గంటల వరకు ముందుగా బుక్ చేసుకున్న ఏడు గంటల స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి.

3) ఒక్కో స్లాట్‌లో గరిష్థంగా 100 మందికి మాత్రమే కూర్చునేందుకు అనుమతి.

4) సందర్శకులు సందర్శన సమయంలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవచ్చు.

5) వాటర్ బాటిళ్లు, బ్రీఫ్‌కేస్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు/లేడీస్ పర్సులు, కెమెరాలు, రేడియోలు/ట్రాన్సిస్టర్లు, గొడుగులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, తినుబండారాలు అనుమతించబడవు.

6) వివిధ ప్రదేశాలలో హ్యాండ్ శానిటైజర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స/వైద్య సౌకర్యాల సదుపాయాలు.

7) సందర్శకులు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కొవిడ్-19 నిబంధనలు తప్పకుండా పాటించాలి.

8) ఎంట్రీ పాయింట్ వద్ద సందర్శకులు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

9) మాస్క్ లేకుంటే సందర్శకులకు అనుమతి లేదు.

Also Read

Aloe vera: కలబంద సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం..

Hyderabad: భాగ్యనగరంలో అభివృద్ధి పనులు.. తవ్వకాల్లో బయట పడిన విగ్రహాలు

Silver Rate Today: షాకిస్తున్న వెండి ధరలు.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..