Hyderabad: భాగ్యనగరంలో అభివృద్ధి పనులు.. తవ్వకాల్లో బయట పడిన విగ్రహాలు

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కరోజే ఆశ్చర్యం కలిగించేలా రెండు ఘటనలు జరిగాయి. అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా, అరుదైన విగ్రహాలు..

Hyderabad: భాగ్యనగరంలో అభివృద్ధి పనులు.. తవ్వకాల్లో బయట పడిన విగ్రహాలు
Follow us

|

Updated on: Feb 11, 2022 | 7:03 AM

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కరోజే ఆశ్చర్యం కలిగించేలా రెండు ఘటనలు జరిగాయి. అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా, అరుదైన విగ్రహాలు బయటపడ్డాయి. నగరానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందన్నది అందరికీ తెలిసిందే. చాలాసార్లు దాన్ని రుజువు చేసేలా అనేక సంఘటనలు జరిగాయి. తాజాగా భాగ్యనగరంలో ఒక్కరోజే రెండు చోట్ల పురాతన విగ్రహాలు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ అధికారులు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ప్రగతినగర్ చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా డ్రైనేజీ పైపులైను పనులు చేస్తుండగా, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. ఇదే కాకుండా మరో శిథిలమైన విగ్రహం కూడా దొరికింది. దీంతో స్థానిక ప్రజలు, ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ సంఘటన స్థలానికి చేరుకొని విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ విగ్రహాలు బయటపడడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు.

తాము పనిచేస్తున్న చోట విగ్రహాలు ఉండటం తమకు ఆనందంగా ఉందని, తమ అదృష్టంగా భావిస్తున్నామని అంటున్నారు గుత్తేదారు. నిజాంపేట్‌లో అలా ఉంటే, మరోచోట లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం బయటపడింది. శేరిలింగంపల్లి నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ కాలనీలోని, ఎమ్యునిటీస్ స్థలంలోని పార్కులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో లక్ష్మీదేవి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం సింహవాహిని దేవి రూపంలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఇటీవల వరంగల్‌ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఆలయంలో తవ్వకాలు జరుపుతుండగా, గరుత్మంతుడు, గోదాదేవి, రామానుజాచార్యుల విగ్రహాలు బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు.. అదిరిపోయే స్టేషన్‌.. ఫోటోలు షేర్‌ చేసిన మంత్రి

4th Booster Shot: అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న కరోనా.. నాల్గో డోస్ ఇచ్చేందుకు సన్నాహాలు..