Aloe vera: కలబంద సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం..
Aloe vera: అలోవెరాలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని అనేక విధాలుగా ఉపయోగించడం వల్ల చాలా ఫేమస్ అయింది. రైతులు కూడా అలోవెరాను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.
Aloe vera: అలోవెరాలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని అనేక విధాలుగా ఉపయోగించడం వల్ల చాలా ఫేమస్ అయింది. రైతులు కూడా అలోవెరాను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నీటిపారుదల సరిగ్గా లేని పరిస్థితిలో కూడా ఈ పంట సాగు చేయవచ్చు. దీని జెల్‌ని సౌందర్య ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రైతులు వర్షాకాలంలో అలోవెరా దుంపలను విత్తుతారు. ఒక హెక్టారులో దాదాపు 40 వేల మొక్కలు నాటవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కసారి నాటితే 4 నుంచి 5 సంవత్సరాలకు ఉత్పత్తి వస్తుంది. రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది.
చాలా మంది రైతులు కలబంద సాగుతో పాటు ప్రాసెసింగ్ కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడమే కాకుండా ఇతర రైతుల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల మంచి ఆదాయం పెంచుకోవచ్చు. పంటని అమ్ముకునేందుకు ఎదురుచూడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రాసెసింగ్ కోసం కలబందని పొటాషియంతో క్లీన్ చేస్తారు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. వీటిని వేడి నీటిలో ఉడికిస్తారు. తర్వాత కలబంద నుంచి జెల్‌ను తీసే పని జరుగుతుంది.
ఈ జెల్‌ను బ్లెండింగ్ మెషీన్‌లో వేసి రసాన్ని తీస్తారు. దానిని 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ఆ తర్వాత రసం ఫిల్టర్ చేసి చల్లబరుస్తారు. అందులో ప్రిజర్వేటివ్స్ కలిపి రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు దీనిని సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన రైతులు మార్కెటింగ్, బ్రాండింగ్‌ను స్వయంగా చేస్తారు. ఈ పని కోసం వారు ప్యాకేజింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.