AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సచిన్‌ కారణంగా ధోని మిస్సయ్యాడు.. లేదంటే ముంబై ఇండియన్స్‌ కింగ్‌ అయ్యేవాడు..?

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్‌ ప్లేయర్ ఎంఎస్‌ ధోని. ఆటగాళ్లను కొనుగోలు చేయడం నుంచి మైదానంలోకి దిగే వ్యూహం వరకు అన్ని ధోని నిర్ణయం మేరకే జరుగుతాయి. అతడి కెప్టెన్సీలో చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకుంది.

IPL 2022: సచిన్‌ కారణంగా ధోని మిస్సయ్యాడు.. లేదంటే ముంబై ఇండియన్స్‌ కింగ్‌ అయ్యేవాడు..?
Ms Dhoni Sachin Tendulkar
uppula Raju
|

Updated on: Feb 09, 2022 | 1:46 PM

Share

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్‌ ప్లేయర్ ఎంఎస్‌ ధోని. ఆటగాళ్లను కొనుగోలు చేయడం నుంచి మైదానంలోకి దిగే వ్యూహం వరకు అన్ని ధోని నిర్ణయం మేరకే జరుగుతాయి. అతడి కెప్టెన్సీలో చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకుంది. IPL 2020 మినహా ప్రతిసారీ జట్టు ప్లేఆఫ్‌కి చేరుకుంది. బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా, లీడర్‌గా ధోనీ చెన్నైని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్‌ను అభిమానులు ఊహించలేరు. అయితే ఐపీఎల్ తొలి వేలంలో ఎంఎస్ ధోని ముంబై ఇండియన్స్‌కి వెళుతాడని అనుకున్నారు. కానీ సచిన్ కారణంగా ఈ ఫ్రాంచైజీ మహిని కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గింది.

వాస్తవానికి 2008లో ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల వేలానికి సంబంధించిన చర్చ జరిగింది. ప్రతి జట్టు ఒక ఐకాన్ ప్లేయర్‌ను ఎంచుకోవాలనుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కోరుకున్నట్లే. పంజాబ్ జట్టు యువరాజ్‌ను కోరగా, ముంబై ఇండియన్స్ జట్టు సచిన్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంది. జట్టులోని అత్యంత ఖరీదైన ఆటగాడి కంటే ఐకాన్ ప్లేయర్‌కు 10 శాతం ఎక్కువ డబ్బు చెల్లించాలనేది నిబంధన. అయితే ధోని రాష్ట్రానికి టీమ్‌ లేనందున ధోని ఏ జట్టుకు ఐకాన్ ప్లేయర్ కాలేదు.

అయితే ప్రతి జట్టు రాష్ట్రానికి చెందిన ఐకాన్ ప్లేయర్‌ని జట్టులోకి తీసుకోవాలని అనుకుంటుండగా చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. వాస్తవానికి చెన్నై జట్టులో ఐకాన్ ప్లేయర్ ఎవరూ కోరుకోలేదు. మహేంద్ర సింగ్ ధోనిని కొనుగోలు చేయడమే వారి మొదటి లక్ష్యం. పిటిఐతో జరిగిన ప్రత్యేక సంభాషణలో శ్రీనివాసన్ ధోనిని కొనుగోలు చేయడం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

“అన్ని జట్లు ఐకాన్‌ ఆటగాళ్లను కోరుకున్నాయి వారికి జట్టులో అత్యధికంగా చెల్లించే ఆటగాడి కంటే 10 శాతం ఎక్కువ డబ్బు చెల్లించాలి. నేను ధోనిని ఎలాగైనా కొనుగోలు చేయాలని అనుకున్నాను. ధోనీ కోసం ముంబై-చెన్నై మధ్య పెద్ద గొడవ జరిగింది. ధోనీని $1.5 మిలియన్లకు బిడ్ వేసినప్పుడు ముంబై సచిన్‌కు $1.65 మిలియన్లు చెల్లించవలసి ఉంటుంది. ఆ సమయంలో జట్టు ధోనీని కొనుగోలు చేసి ఉంటే ఈ ఇద్దరు ఆటగాళ్లకే 60 శాతం డబ్బు ఖర్చు చేయవలసి ఉండేది. దీంతో ముంబై జట్టు వెనక్కి తగ్గింది. దీంతో మేము ధోనీని దక్కించుకున్నాం” అని చెప్పాడు.

Viral Photos: ఓరి దేవుడా.. ఈ మహిళ అలా కనిపించడం కోసం ఎంత పనిచేసిందంటే..?

Saliva Test: లాలాజల టెస్ట్‌తో క్యాన్సర్, డయాబెటీస్‌ గుర్తింపు.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..?

Trees Exploding: అక్కడ అర్ధరాత్రి చెట్లు పేలిపోతున్నాయి.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..?