AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI, 2nd ODI: రెండో వన్డేలో కుప్పకూలిన విండీస్.. టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..

రెండో వన్డేలో టీమిండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 237 పరుగులు చేయగా..

IND vs WI, 2nd ODI: రెండో వన్డేలో కుప్పకూలిన విండీస్.. టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
India Vs West Indies 2nd Odi
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 09, 2022 | 9:44 PM

Share

రెండో వన్డేలో టీమిండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 237 పరుగులు చేయగా.. 238 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 193 పరుగులకే కుప్పకూలింది. దీనితో టీమిండియా 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

రెండో వన్డేలో టీమిండియా(Team India) బ్యాటింగ్ ఆకట్టుకోవడంలో విఫలమైంది. విండీస్ బౌలర్ల ముందు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. దీంతో విండీస్(West Indies) ముందు 238 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సాధించాలనుకుంది. కానీ, రెండో వన్డేలో పుంజుకున్న వెస్టిండీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.

ప్లేయింగ్ XI:

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ధ్ కృష్ణ.

వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, శర్మ బ్రూక్స్, జాసన్ హోల్డర్, ఓడెన్ స్మిత్, ఫాబియన్ అలెన్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2022 09:43 PM (IST)

    విండీస్ ఆలౌట్..

    రెండో వన్డేలో టీమిండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 237 పరుగులు చేయగా.. 238 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ 193 పరుగులకే కుప్పకూలింది. దీనితో టీమిండియా 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

  • 09 Feb 2022 09:42 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన విండీస్

    అకేల్ హోసేన్(34) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. విండీస్ 159 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది

  • 09 Feb 2022 09:42 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన విండీస్

    అలెన్(13) రూపంలో వెస్టిండీస్ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు అలెన్. దీనితో 159 పరుగుల వద్ద విండీస్ ఏడో వికెట్ కోల్పోయింది.

  • 09 Feb 2022 07:49 PM (IST)

    ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్..

    భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ టీం వరుసగా వికెట్లను కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోతోంది. తక్కువ స్కోర్‌ను కాపాడుకోవడంలో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం 26 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రసీద్ధ్ 3, చాహల్, ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.

  • 09 Feb 2022 06:31 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్..

    డారెన్ బ్రావో (1 పరుగు, 3 బంతులు) రూపంలో వెస్టిండీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 9.1 ఓవర్లలో 38 పరుగుల వద్ద విండీస్ తన 2వ వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 05:22 PM (IST)

    వెస్టిండీస్ టార్గెట్ 238

    రెండో వన్డేలో టీమిండియా(Team India) బ్యాటింగ్ ఆకట్టుకోవడంలో విఫలమైంది. విండీస్ బౌలర్ల ముందు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. దీంతో విండీస్(West Indies) ముందు 238 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 09 Feb 2022 05:11 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్..

    దీపక్ హుడా (29 పరుగులు, 25 బంతులు) రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. 48.1 ఓవర్లలో 226 పరుగుల వద్ద భారత్ తన 9వ వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 05:07 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్..

    మహ్మద్ సిరాజ్ (3 పరుగులు, 5 బంతులు) రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. 47.3 ఓవర్లలో 224 పరుగుల వద్ద భారత్ తన 8వ వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 04:58 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    శార్దుల్ ఠాకూర్ (8 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్) రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ను కోల్పోయింది. 45.6 ఓవర్లలో 212 పరుగుల వద్ద భారత్ తన ఏడో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 04:43 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    వాషింగ్టన్ సుందర్ (24 పరుగులు, 41 బంతులు, 1 ఫోర్) రూపంలో టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 41.6 ఓవర్లలో 192 పరుగుల వద్ద భారత్ తన ఆరో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 04:31 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    సూర్య కుమార్ యాదవ్ (64 పరుగులు, 83 బంతులు, 5 ఫోర్లు) రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్ భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడు. దీంతో 38.5 ఓవర్లలో 177 పరుగుల వద్ద భారత్ తన ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 04:05 PM (IST)

    150 పరుగులకు చేరిన భారత్ స్కోర్..

    సూర్యకుమార్ (45), వాషింగ్టన్ సుందర్ (11) జోడీ టీమిండియా స్కోర్‌ను 150 పరుగులు దాటించారు. అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో రాహుల్ (49) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సుందర్‌తో కలిసి టీం స్కోర్‌ను 150 దాటించాడు.

  • 09 Feb 2022 03:51 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    కేఎల్ రాహుల్(49 పరుగులు, 28 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. తన అర్థ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 29.4 ఓవర్లలో 134 పరుగుల వద్ద భారత్ తన నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 03:33 PM (IST)

    100 పరుగులకు చేరిన భారత్ స్కోర్..

    రాహుల్(32), సూర్యకుమార్(24) టీమిండియాకు కీలక భాగస్వామ్యంతో టీం స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తూ భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపేందుకు సహాయం చేస్తు్న్నారు.

  • 09 Feb 2022 03:29 PM (IST)

    అర్థ సెంచరీ భాగస్వామ్యం..

    రాహుల్(24), సూర్యకుమార్(24) టీమిండియాకు కీలక భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 83 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను అర్థసెంచరీ భాగస్వామ్యంతో పటిష్ట దిశవైపు తీసుకెళ్తున్నారు.

  • 09 Feb 2022 03:20 PM (IST)

    రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌ల కీలక భాగస్వామ్యం

    ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఇద్దరు కీలక భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్నారు. 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకునేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి 69 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు.

  • 09 Feb 2022 02:46 PM (IST)

    50 పరుగులకు చేరిన టీమిండియా స్కోర్..

    టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ దెబ్బలు తగిలాయి. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. రోహిత్ 5, పంత్ 18, విరాట్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 2, సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.15.4 ఓవర్లకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

  • 09 Feb 2022 02:38 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్..

    విరాట్ కోహ్లీ(18) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. స్మిత్ బౌలింగ్‌లో హోప్ క్యాచ్ పట్టడంతో విరాట్ తన సెంచరీ మ్యాచులో ప్రత్యేకంగా ఏం చేయలేక పెవిలియన్ చేరాడు. దీంతో 11.6 ఓవర్లలో 43 పరుగుల వద్ద భారత్ తన మూడో వికట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 02:25 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    రిషబ్ పంత్(18) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. స్మిత్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు. దీంతో 11.1 ఓవర్లలో 39 పరుగుల వద్ద భారత్ తన రెండో వికట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 01:52 PM (IST)

    విరాట్ ‘సెంచరీ’ మ్యాచ్

    రెండో వన్డేలో రోహిత్ ఔటయ్యాక బరిలోకి దిగిన విరాట్ కోహ్లీకి ఇది ఎంతో ప్రత్యేకమైన మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఈ మ్యాచుతో విరాట్ తన 100 వ వన్డేను టీమిండియా తరపున ఆడుతున్నాడు.

  • 09 Feb 2022 01:50 PM (IST)

    రోహిత్ ఔట్..

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తమ ఎంపిక తప్పు కాదని నిరూపించుకుంది. ఆదిలోనే హిట్‌మ్యాన్ రోహిత్(5) వికెట్‌ను పడగొట్టి టీమిండియాకు షాకిచ్చింది. రోచ్ బౌలింగ్‌లో హోప్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 9 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Feb 2022 01:23 PM (IST)

    ఎప్పుడూ మొదట బ్యాటింగ్ చేయడమే ఇష్టం: రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ: ఇది మాకు ఒక సవాలుగా ఉంటుంది. మేం ఎల్లప్పుడూ మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటాం. స్కోర్‌ను బోర్డుపై వీలైనంతంగా ఎక్కువ పరుగులు ఉంచాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. ప్లేయింగ్ XIలో ఒక మార్పుతో బరిలోకి దిగనున్నాం. ఇషాన్ కిషన్ స్థానంలో కేఎల్ రాహుల్ తిరిగి జట్టుతో చేరాడు.

  • 09 Feb 2022 01:21 PM (IST)

    మంచి బ్రాండ్ క్రికెట్ ఆడడమే మా లక్ష్యం: నికోలస్ పూరన్

    నికోలస్ పూరన్: మేం ముందుగా బౌలింగ్ చేయాలని కోరుకున్నాం. అందుకే టాస్ గెలిచిన వెంటనే భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాం. కీరోన్ ఫిట్‌గా లేడు. మంచి బ్రాండ్ క్రికెట్ ఆడడమే మా లక్ష్యం. అందుకోసం జట్టులో కీలక మార్పు ఒకటి చేశాం. ఒడియన్ స్మిత్‌ను ప్లేయింగ్ XIలో చేర్చాం.

  • 09 Feb 2022 01:15 PM (IST)

    వెస్టిండీస్ ప్లేయింగ్ XI

    వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, శర్మ బ్రూక్స్, జాసన్ హోల్డర్, ఓడెన్ స్మిత్, ఫాబియన్ అలెన్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.

  • 09 Feb 2022 01:14 PM (IST)

    టీమిండియా ప్లేయింగ్ XI

    భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ధ్ కృష్ణ.

  • 09 Feb 2022 01:13 PM (IST)

    టాస్ గెలిచిన వెస్టిండీస్

    భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య నేడు అహ్మదాబాద్‌లో రెండో వన్డే జరగుతోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Published On - Feb 09,2022 1:10 PM