Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

Health News: చలికాలంలో రోగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రాచీన కాలం నుంచి ఇదే జరుగుతుంది. జలుబు,

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?
Flax Seeds
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2022 | 10:42 AM

Health News: చలికాలంలో రోగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రాచీన కాలం నుంచి ఇదే జరుగుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అలాగే మంచి ఆహారం ఎప్పుడైనా రోగాలని దరిచేరనివ్వదు. అలాంటి వాటిలో అవిసెగింజలు ఒకటి. మీరు వీటి గురించి వినే ఉంటారు. నిజానికి అవిసె గింజల్లో ఒమేగా 3 వంటి ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. చర్మం, జుట్టుకు పోషకాలను అందించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ముడతల సమస్య

అవిసె గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖం చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వీటిని తినడం వల్ల ముడతల సమస్య ఉండదు. చర్మం మెరిసేలా చేస్తుంది. దీంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది.

2. గుండె జబ్బులను తగ్గిస్తుంది

అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా అవిసె గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.

3. ఊబకాయాన్ని తగ్గిస్తుంది

అవిసె గింజలు బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది.

4. మధుమేహం కంట్రోల్‌

అవిసె గింజలు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

IPL 2022: 590 మంది ఆటగాళ్ల భవితవ్యం.. IPL 2022 వేలం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే..?

IPL 2022: యువరాజ్‌ సింగ్‌ రికార్డ్‌ బ్రేక్ చేసిన ఈ ఆటగాడు రిటైర్మెంట్‌.. ఈ సీజన్ ఐపీఎల్‌ ఆడటం లేదు..?

IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే.. జట్టులో స్వల్ప మార్పులు..