IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే.. జట్టులో స్వల్ప మార్పులు..
IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. శిఖర్ ధావన్ పునరాగమనం బ్యాటింగ్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. వన్డే సిరీస్ ప్రారంభానికి
IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. శిఖర్ ధావన్ పునరాగమనం బ్యాటింగ్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ధావన్‌తో సహా నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ధావన్ గైర్హాజరీలో మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరోవైపు వెస్టిండీస్ పరువు కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. గత 17 మ్యాచ్‌ల్లో 11వ సారి పూర్తి 50 ఓవర్లు ఆడలేకపోతుంది. కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడాలి. షాయ్ హోప్, బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ నుంచి మంచి ప్రదర్శనలు ఆశిస్తున్నారు. ఎలాగైనా క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకోవాలని వెస్టిండీస్ జట్టు ప్రయత్నిస్తోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తదుపరి మ్యాచ్‌లో శిఖర్ ఆడతాడని చెప్పాడు. అతను మైదానంలో కచ్చితంగా ఉండాలని అన్నాడు. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీతో కలిసి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. రెండో మ్యాచ్‌లో భారత జట్టు తొమ్మిది వికెట్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య 3వ వన్డే మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఫిబ్రవరి 11 (శుక్రవారం)న భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే ఎక్కడ జరుగుతుంది?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరగనుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య 3వ వన్డే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ మధ్యాహ్నం 01:30 గంటలకు ప్రారంభం కాగా, టాస్ ఆఫ్ మ్యాచ్ మధ్యాహ్నం 01:00 గంటకి జరుగుతుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే 3వ ODI మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ఈ మ్యాచ్‌ను చూడవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌తో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. లైవ్ అప్‌డేట్ tv9teluguలో చదవవచ్చు.