IPL 2022: IPL వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కి షాక్.. బ్యాటింగ్ కోచ్ రాజీనామా..?
IPL 2022: ఐపీఎల్ 2022 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వసీం జాఫర్ 2019 సంవత్సరం
IPL 2022: ఐపీఎల్ 2022 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వసీం జాఫర్ 2019 సంవత్సరం నుంచి పంజాబ్ కింగ్స్‌కి బ్యాటింగ్ కోచ్‌గా ఉంటున్నాడు. జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌కు సహకరించాడు. అయితే సడెన్‌గా రాజీనామా చేయడంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పంజాబ్ ఫ్రాంచైజీకి మంచిది కాదు.
వసీం జాఫర్ రాజీనామా తర్వాత పంజాబ్ కింగ్స్ ఇప్పుడు ఆటగాళ్లే కాకుండా బ్యాటింగ్ కోచ్ కోసం కూడా వెతికే పనిలో పడింది. బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన డామియన్ రైట్, ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్ జట్టుతో సంబంధం కలిగి ఉన్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని వసీం జాఫర్ ఫన్నీ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. రణబీర్ కపూర్ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’లోని ‘అచ్చా చలా హూన్, దువాన్ మే యాద్ రఖానా’ పాట చిత్రాన్ని పోస్ట్ చేసి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే IPL 2022 కోసం అనిల్ కుంబ్లే, మొత్తం జట్టుకి శుభాకాంక్షలు తెలియజేశారు.
వసీం జాఫర్ ఐపీఎల్ ఆడాడు. మొదటి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. 6 మ్యాచ్‌ల్లో 19.16 సగటుతో 115 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లకు, అన్‌క్యాప్‌డ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.4 కోట్లకు రిటైన్ చేసింది. ఐపీఎల్ 2022కి కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని పంజాబ్ కింగ్స్ భావించింది. ఫ్రాంచైజీ ఐపీఎల్ 2022 వేలంలో రూ.72 కోట్లతో ప్రవేశిస్తుంది.
Adios, and thank you @PunjabKingsIPL, it’s been a pleasure. Wishing @anilkumble1074 and the team very best for #IPL2022 ? pic.twitter.com/rDivb0akZp
— Wasim Jaffer (@WasimJaffer14) February 10, 2022