IPL 2022 Auction Live Streaming: 590 మంది ఆటగాళ్ల భవితవ్యం.. IPL 2022 వేలం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే..?
IPL Auction 2022 Live Updates: ఐపీఎల్ 2022 వేలం అభిమానులకు చాలా ప్రత్యేకమైంది. ఈసారి వేలంలో 8 కాదు 10 జట్లు పాల్గొంటున్నాయి. పాత 8 జట్లతో పాటు ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్,
IPL 2022 Auction Live Streaming: ఐపీఎల్ 2022 వేలం అభిమానులకు చాలా ప్రత్యేకమైంది. ఈసారి వేలంలో 8 కాదు 10 జట్లు పాల్గొంటున్నాయి. పాత 8 జట్లతో పాటు ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ సూపర్ జెయింట్స్ జట్లు తొలిసారి వేలంలో పాల్గొంటున్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్లను వేలం వేస్తాయి. 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. దాదాపు 50 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లుగా ఉంచారు. రెండు డజన్ల కంటే ఎక్కువ మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లు కాగా, చాలా మంది ఆటగాళ్ల ధరను కోటి వద్ద ఉంచారు. వీరితో పాటు రూ.50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల బేస్ ధర ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. 8 పాత IPL ఫ్రాంచైజీలు మొదటి 27 మంది ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకున్నాయి. అదే సమయంలో 2 కొత్త IPL జట్లు వేలానికి ముందు ఒక్కొక్క జట్టు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
ఐపీఎల్ వేలంలో వెటరన్లు
ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, దినేష్ కార్తీక్, మరికొందరు ఆటగాళ్లు మార్క్యూ ప్లేయర్‌లుగా మారారు. భారత అండర్-19 స్టార్లు, కెప్టెన్ యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్‌లతో పాటు షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, అవేష్ ఖాన్ వంటివారు ఉన్నారు. లక్నో 17 కోట్లకు కేఎల్ రాహుల్‌ను తన జట్టుతో చేర్చుకుంది. దీంతో ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2021 సీజన్‌లో కేవలం 17 కోట్లు మాత్రమే పొందాడు.
IPL 2022 వేలం ఎప్పుడు జరుగుతుంది?
IPL 2022 వేలం ఫిబ్రవరి 12, 13 (శనివారం, ఆదివారం) జరుగుతుంది.
IPL 2022 వేలం ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ 2022 వేలం బెంగళూరులో జరగనుంది.
IPL 2022 వేలం ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
IPL 2022 వేలం షెడ్యూల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
IPL 2022 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
టీవీ వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
IPL 2022 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు?
OTT ప్లాట్‌ఫారమ్ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2022 లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. వేలం వివరాల అప్‌డేట్స్ ఇక్కడ లైవ్‌లో చూడండి.. దీంతో పాటు tv9telugu.com కూడా చూడవచ్చు.