Karnataka Crime News: యువకుడి దారుణ హత్య.. అమ్మవారి ఆలయం వద్ద తల ఉంచి.. అసలేం జరిగిందంటే..??

కర్ణాటకలోని బాగలూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి తల నరికి దారుణంగా హత్య చేశారు. తలను స్థానికంగా ఉన్న...

Karnataka Crime News: యువకుడి దారుణ హత్య.. అమ్మవారి ఆలయం వద్ద తల ఉంచి.. అసలేం జరిగిందంటే..??
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 11, 2022 | 7:06 AM

కర్ణాటకలోని బాగలూరులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడి తల నరికి దారుణంగా హత్య చేశారు. తలను స్థానికంగా ఉన్న మారియమ్మ ఆలయం వద్ద ఉంచి, మొండెంను సమీపంలోని చెట్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కుమారుడు ప్రదీప్‌. ఇతనికి చంద్రిక అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. మరో సారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం చంద్రిక పుట్టింటికెళ్లింది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రదీప్‌ తల నరికి అదే ప్రాంతంలోని మారియమ్మ ఆలయం ముందు పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న బాగలూరు పోలీసులు సమీప ప్రాంతాల్లో మొండెం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కొంచెం దూరంలో తల లేని మృతదేహం కనిపించింది. ఎస్పీ అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్‌కు గత 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసును కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read

Telangana Crime News: వృద్ధురాలిపై అత్యాచారం.. కల్లు తాగించి అఘాయిత్యం.. సంచలన తీర్పునిచ్చిన న్యాయస్థానం

AP News: అమలాపురంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. కిలోమీటర్లమేర నిలిచిపోయిన వాహనాలు.. ఎందుకంటే..?

Lakhimpur Kheri violence: యూపీలో కీలక పరిణామం.. లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ