- Telugu News Photo Gallery Cinema photos Bollywood star heroines focused on Tollywood telugu film news
Bollywood to Tollywood: టాలీవుడ్ బాట పట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..
ఒకప్పుడు తెలుగు సినిమాల వైపు తొంగి చూడని బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలను సెలక్ట్ చేసుకొని మరీ ఎంట్రీ ఇస్తున్నారు.
Rajeev Rayala | Edited By: Anil kumar poka
Updated on: Oct 26, 2022 | 3:38 PM

ఒకప్పుడు తెలుగు సినిమాల వైపు తొంగి చూడని బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలను సెలక్ట్ చేసుకొని మరీ ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ చేస్తున్న చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే.

అలియా భట్ `ఆర్ ఆర్ ఆర్`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ - కొరటాల శివ చిత్రంలోనూ నటిస్తోంది. త్వరలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతోంది.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే కూడా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న `ప్రాజెక్ట్ కె`లో దీపిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఓ ఇంట్రవ్యూలో దీపికా మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో కలిసి నటించాలని వుందని చెప్పుకొచ్చింది.

విజయ్ దేవరకొండ నటిస్తున్న `లైగర్` మూవీతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుతోంది.

పూరి - విజయ్ దేవరకొండ చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న `జన గన మణ`తో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కాయం అని వార్తలు వినిపిస్తున్నారు.





























