జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన వర్గానికి సీట్లు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరును వ్యతిరేకిస్తూ తన అనుచరులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తుండగా, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళలు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు.