AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌..  అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

Phani CH
|

Updated on: Feb 07, 2026 | 12:56 PM

Share

ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాలు వర్ణనాతీతం. ప్రమాదాలను సైతం లెక్కచేయక, సమయానికి ఫుడ్ అందిస్తుంటారు. ఇటీవల, ఓ డెలివరీ బాయ్‌కి అర్ధరాత్రి శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సి వచ్చింది. ఈ భయంకర అనుభవంతో వణికిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఇది నిజమా లేదా AI క్రియేషనా అనే చర్చ నడుస్తోంది.

ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఫుడ్ డెలివరీ సమయంలో ప్రమాదాలకు గురై గాయాలపాలైన వారు.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి రావటంతో అతడు గజగజ వణికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ బిర్యానీ పార్శిల్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన చోటుకు వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. ఆ వ్యక్తి కొంచెం ముందుకు రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని కోరాడు. తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ఆమె అంది. పార్శిల్‌ను లోపలికి తెచ్చి ఇవ్వమంది. ఫ్రెండ్స్‌తో కలిసి లోపల పార్టీ చేసుకుంటున్నానని ఆ అమ్మాయి చెప్పడతో అతడు భయపడిపోయాడు. శ్మశానం లోపలికి రాలేనని, ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని కోరాడు. ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా వెళ్లిపోయాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. అది ఫేక్ వీడియో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరికొంతమంది అది ఏఐ వీడియో అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి