AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..

స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..

Phani CH
|

Updated on: Feb 07, 2026 | 12:50 PM

Share

హోంవర్క్ చేయలేదని విద్యార్థినిని కొట్టిన టీచర్‌కు గాంధీనగర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ ఘటనలో విద్యార్థిని కర్ణభేరి దెబ్బతిని వినికిడి కోల్పోవడంతో పేరెంట్స్ వెనక్కి తగ్గలేదు. పాఠశాలల్లో పిల్లలను దండించే పద్ధతులపై తల్లిదండ్రుల వైఖరి మారిన నేపథ్యంలో ఈ తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది, టీచర్లకు గుణపాఠంగా మారింది.

స్కూల్ అన్నాక పిల్లల అల్లరి, టీచర్స్ కొట్టడం కామన్. బెత్తం దెబ్బలు తినని స్టూడెంట్ ఉండడు, పిల్లల్ని నాలుగు దెబ్బలు తగిలించని టీచర్ ఉండరు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి, ఒకప్పుడు పిల్లల్ని కొట్టైనా సరే దారిలో పెట్టమని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని తిట్టినా ఒప్పుకోవట్లేదు. హోమ్ వర్క్ చేయలేదని అమ్మాయిని కొట్టినందుకు టీచర్ కి మూడేళ్ళ జైలు శిక్ష పడిన ఘటన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గుజరాత్ లోని గాంధీనగర్ లోని కోర్టు తీర్పుపై రాష్ట్రంలో అంతా చర్చించుకుంటున్నారు. 2020లో గుజరాత్ లోని గాంధీనగర్ లోని ఓ స్కూల్లో హోమ్ వర్క్ చేయని కారణంగా 9వ తరగతి విద్యార్థిని ని కొట్టింది ఓ టీచర్. దీంతో ఆ అమ్మాయి కర్ణభేరి దెబ్బతినింది. దాంతో కోర్టును ఆశ్రయించారు అమ్మాయి పేరెంట్స్. ఐదేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిపిన గాంధీనగర్ సెషన్స్‌ కోర్టు టీచర్ కు మూడేళ్ళ మూడు నెలల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో టీచర్ రాజీకి ప్రయత్నించగా అమ్మాయి పేరెంట్స్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. టీచర్ కొట్టడంతో అమ్మాయి పూర్తిగా వినికిడి కోల్పోయిందని.. ఈ కారణంగా తమ కూతురు తీవ్ర మానసిక క్షోభకు గురైందని అంటున్నారు పేరెంట్స్. మొత్తానికి స్కూల్లో నాలుగు గోడల మధ్య రొటీన్ గా జరిగే సీన్ లో ఒక అమ్మాయి వినికిడి కోల్పోతే.. టీచర్ ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి