AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan vs Sanju Samson : ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది

Ishan Kishan vs Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలైపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. తన తొలి మ్యాచ్‌లో అమెరికాను ఢీకొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే..

Ishan Kishan vs Sanju Samson : ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది
Ishan Kishan Vs Sanju Samson
Rakesh
|

Updated on: Feb 07, 2026 | 2:13 PM

Share

Ishan Kishan vs Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలైపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. తన తొలి మ్యాచ్‌లో అమెరికాను ఢీకొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే.. “ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మకు తోడుగా వచ్చేది ఎవరు? ఇషాన్ కిషనా లేక సంజు శాంసనా?” అని. తాజా సమాచారం ప్రకారం.. టీమ్ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. సంజు శాంసన్‌ను పక్కన పెట్టి, విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్‌కే ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా ముగ్గురు ఓపెనర్లను ఎంపిక చేసింది. అందులో అభిషేక్ శర్మ స్థానం సుస్థిరం కాగా, రెండో ఓపెనర్ స్థానం కోసం సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు సంజు శాంసనే ఓపెనర్‌గా వస్తాడని అందరూ భావించారు. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజు ఘోరంగా విఫలమవడం అతనికి మైనస్‌గా మారింది. అదే సమయంలో దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, కివీస్‌పై 103, 76 వంటి పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తన సత్తా చాటుకున్నాడు. దీంతో మేనేజ్మెంట్ ఇషాన్‌కే ఓటు వేసింది.

సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనే టీమిండియా తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు పిండుకుని తన ఫామ్ ఎంత పీక్స్‌లో ఉందో చూపించాడు. మరోవైపు, అదే మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక అమెరికాతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే, అక్కడ బౌలర్లు కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే, సంజు శాంసన్ మాత్రం ఒక్కసారి కూడా బ్యాట్ పట్టకపోవడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే సంజు శాంసన్ తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కాబోతున్నాడని స్పష్టమవుతోంది.

ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్‌లో అమెరికా బౌలర్లను చెడుగుడు ఆడుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కప్టెన్సీలో భారత్ తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్ఏ జట్టు భారత్‌కు ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి. అయితే ఓపెనింగ్‌లో కిషన్, అభిషేక్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు