ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. జరిమానా ఎంతంటే?
Riyan Parag Fined Vaping in Dressing Room: రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పరాగ్, తన దూకుడు స్వభావంతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం డ్రెస్సింగ్ రూంలో ఈ సిగిరెట్ తాడుతూ కెమెరాల్లో చిక్కడంతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Riyan Parag Fined Vaping in Dressing Room: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో తన ఆటతో ఆకట్టుకుంటున్న ఈ యువ కెప్టెన్, మైదానం వెలుపల చేసిన ఒక పని వల్ల భారీ జరిమానాకు గురయ్యాడు. నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వ్యవహరించినందుకు ఐపీఎల్ పాలక మండలి కఠిన నిర్ణయం తీసుకుంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో నిబంధనల ఉల్లంఘన..
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న రియాన్ పరాగ్, ఒక మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లోపల ఈ సిగిరెట్ తాగినట్లు తేలింది. క్రీడాకారులు మైదానంలో, డ్రెస్సింగ్ గదిలో పాటించాల్సిన క్రమశిక్షణా నియమావళిని ఆయన అతిక్రమించారని అధికారులు గుర్తించారు. ఈ పరిణామం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కలిగిన కెప్టెన్ ఇలాంటి చర్యకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారీ జరిమానా విధించిన అధికారులు..
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ క్రమశిక్షణా కమిటీ, రియాన్ పరాగ్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. క్రీడా నియమ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ పరిసరాల్లో పొగతాగడం లేదా మరే ఇతర నిషేధిత కార్యకలాపాలకు పాల్పడటం నిషిద్ధం. పరాగ్ తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. ఈ జరిమానాతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే మరింత కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కెప్టెన్సీపై పడుతున్న నీలినీడలు..
యువ ఆటగాడిగా ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పరాగ్, తన దూకుడు స్వభావంతో ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచారు. అయితే, ప్రస్తుత వివాదం ఆయన నాయకత్వ పటిమపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జట్టులో క్రమశిక్షణను నెలకొల్పాల్సిన వారే ఇలాంటి పనులు చేయడం వల్ల మిగిలిన క్రీడాకారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్రీడల్లో నైపుణ్యంతో పాటు ప్రవర్తన కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కోట్లాది మంది యువత ఆదర్శంగా తీసుకునే ఐపీఎల్ వంటి వేదికలపై క్రీడాకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రియాన్ పరాగ్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడు ఆటపై దృష్టి పెట్టి, వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా ఈ విషయంలో తమ ఆటగాడికి కౌన్సెలింగ్ ఇచ్చే యోచనలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
