AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఒకే క్లిక్‌తో కేవలం 10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా అక్కర్లేదు..

గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఇక నుంచి మూడు రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికే సిలిండర్ వచ్చేస్తుంది. క్విక్ కామర్స్ యాప్‌లో ఎప్పుడైనా సరే బుక్ చేసుకుంటే వెంటనే డోర్ డెలివరీ చేస్తారు.

Gas Cylinder: ఒకే క్లిక్‌తో కేవలం 10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా అక్కర్లేదు..
5kg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jul 22, 2026 | 11:47 AM

Share

ప్రతి ఇంట్లో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన నిత్యావసర వస్తువుల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి. గ్యాస్ లేకపోతే వంటింట్లో ఏ పని జరగదు. ఒక్కొసారి గ్యాస్ డెలివరీ ఆలస్యం అయితే వంట చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంట్లో ఎక్కువమంది కుటుంబసభ్యులు ఉంటే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం సిలిండర్ బుకింగ్ చేయగానే డోర్ డెలివరీ అవ్వడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే వాడేవారు ఈ రెండు, మూడు రోజుల పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు బుక్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది. దీనికి గ్యాస్ కనెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇంటికి సిలిండర్ రాగానే ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం లేదా ఓటీపీ చెబితే సరిపోతుంది. ఎలా అనేది తెలుసుకుందాం.

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్

ప్రస్తుతం మెట్రో సిటీల్లో క్విక్ కామర్స్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. కేవలం 10 నిమిషాల్లోనే ఏ వస్తువునైనా డెలివరీ చేస్తున్నాయి. అయితే ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌ను కూడా ఇదే తలహాలో బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్‌పీ నవ్య సిలిండర్‌ను ఇన్‌స్టామార్ట్ ద్వారా డెలివరీ చేయనున్నారు. కాంపాక్ట్, సమకాలీన డిజైన్ కారణంగా ఈ సిలిండర్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టుకోగానే ఇంటికి డెలివరీ చేస్తారు. 5 లేదా 10 కేజీల సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది బాగా ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ సేవలు ప్రారంభమవ్వగా.. త్వరలో దేశవ్యాప్తంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హెచ్‌పీసీఎల్ కలిసి ప్రవేశపెట్టనున్నాయి. ఈ సిలిండర్ బుక్ చేసుకునేందుకు ఎలాంటి LPG కనెక్షన్ అవసరం లేదు.

ఎలా బుక్ చేసుకోవాలంటే..?

ఇన్‌స్టామార్ట్ యాప్‌లోకి వెళ్లి 10-కేజీల కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్ లేదా 5-కేజీల మెటల్ సిలిండర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కార్ట్‌లో చేర్చిన తర్వాత పేమెంట్ చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఇంటికి సిలిండర్ వచ్చాక డెలివరీ రుజువు పత్రాలతో పాటు గుర్తింపు ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కసారి సమర్పిస్తే తర్వాత రీఫిల్లింగ్ కోసం అవసరం లేదు. అలాగే డెలివరీ ధృవీకరణకు ఓటీపీ చెబితే సరిపోతుంది. ప్రస్తుతానికి డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే డెలివరీ చేసేందుకు ఓటీపీ అడుగుతున్నారు. అదే విధానం వీటికి కూడా పాటించనున్నారు.

Follow Us
తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించిన టాలీవుడ్ హీరోయిన్
తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్‌ కొనసాగించిన టాలీవుడ్ హీరోయిన్
గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు
గుమ్మడికాయ లడ్డు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోలేరు
ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల
ఒకే ఒక్క టికెట్‌తో మారిన జాతకం..రాత్రికి రాత్రే రూ.8,700 కోట్ల
24 గంటల్లోనే భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?
24 గంటల్లోనే భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?
బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్.. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్.. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ..
రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం.. ఏమన్నారంటే..
రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం.. ఏమన్నారంటే..
నాగ పంచమి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే! నాగదేవత పూజా విధానం
నాగ పంచమి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి ఇవే! నాగదేవత పూజా విధానం
ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు..
ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు..
తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. గుర్తు పట్టారా?
తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. గుర్తు పట్టారా?