AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?.. గౌతమ్ గంభీర్‌పై శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం

Team India : కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపడం ఘోర తప్పిదమని గౌతమ్ గంభీర్‌పై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల మాదిరిగానే రాహుల్ విషయంలోనూ ప్రయోగాలు చేయడం టీమిండియాకు నష్టమైందని ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Team India : సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?.. గౌతమ్ గంభీర్‌పై శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం
Kl Rahul
Rakesh
|

Updated on: Jul 22, 2026 | 10:59 AM

Share

Team India : భారత క్రికెట్ జట్టుకు యూకే పర్యటన తీవ్ర నిరాశతో ముగిసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన టి20 సిరీస్‌లలో ఓటమి పాలైన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. ఈ పర్యటనలో జట్టు ప్రదర్శన కంటే కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ చేస్తున్న ప్రయోగాలు జట్టు కొంపముంచుతున్నాయని మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.

గంభీర్‌పై మాజీ కెప్టెన్ శ్రీకాంత్ ఫైర్

భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో గౌతమ్ గంభీర్ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలో 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్‌ను 6వ స్థానానికి నెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాహుల్‌కు జరిగిన ఘోరమైన అన్యాయమని, గతంలో సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ విషయంలో చేసిన తప్పులనే ఇప్పుడు రాహుల్ విషయంలోనూ పునరావృతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లార్డ్స్ వన్డేలో తలకిందులైన వ్యూహాలు

లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ తర్వాత 4వ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌ను బరిలోకి దించారు. కానీ ఇద్దరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీకి సహకారం అందిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించే సామర్థ్యం ఉన్న కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో పంపాల్సింది పోయి, రన్ రేట్ ఓవర్లకు 15 పరుగులు దాటిపోయాక 6వ స్థానంలో పంపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయిందని శ్రీకాంత్ విశ్లేషించారు.

జట్టులో వరుస మార్పులు.. తగ్గని ఆందోళన

ఇటీవల టి20 సిరీస్‌లలో కూడా శాంసన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీలతో రకరకాల ఓపెనింగ్ కాంబినేషన్లు మార్చడాన్ని శ్రీకాంత్ గుర్తు చేశారు. నిలకడ లేని ఈ మార్పుల వల్ల ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌లో నమ్మకం సడలుతోందని, గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశీ గడ్డపై భారత్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ ఓటమి అని ఎత్తి చూపారు. పదే పదే ఆటగాళ్ల స్థానాలను మార్చడం మానేసి జట్టులో స్థిరత్వాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us