AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: వర్షం పుణ్యమా అని క్వార్టర్స్‌కు చేరిన అఫ్ఘానిస్థాన్.. భారత్‌తో తలపడేది ఎప్పుడంటే?

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్‌లో వర్షం అఫ్ఘానిస్థాన్‌కు కలిసొచ్చింది. జపాన్, నేపాల్ మ్యాచ్ రద్దవడంతో అఫ్ఘాన్ జట్టు గ్రూప్ ఏలో రెండో స్థానంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో సెప్టెంబర్ 28న శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియాతో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Asian Games 2026: వర్షం పుణ్యమా అని  క్వార్టర్స్‌కు చేరిన అఫ్ఘానిస్థాన్.. భారత్‌తో తలపడేది ఎప్పుడంటే?
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 26, 2026 | 12:06 PM

Share

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో జపాన్, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో అంపైర్లు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అంతకుముందు అఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన జపాన్ జట్టు ఈ మ్యాచ్ కూడా రద్దు కావడంతో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మరోవైపు నేపాల్ జట్టు మూడు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

అఫ్ఘానిస్థాన్‌కు కలిసొచ్చిన అదృష్టం

జపాన్, నేపాల్ మధ్య మ్యాచ్ రద్దు కావడం అఫ్ఘానిస్థాన్ జట్టుకు నిజంగా ఒక వరంలా మారింది. టోర్నమెంట్‌లో భాగంగా అఫ్ఘాన్ జట్టు తొలి మ్యాచ్‌లో జపాన్‌పై విజయం సాధించినప్పటికీ, రెండో మ్యాచ్‌లో నేపాల్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో ఆ జట్టు తదుపరి దశకు అర్హత సాధించడం చాలా కష్టంగా మారింది. అయితే చివరి నిమిషంలో వర్షం రూపంలో వచ్చిన అదృష్టం వల్ల జపాన్-నేపాల్ మ్యాచ్ రద్దయి, అఫ్ఘానిస్థాన్ జట్టు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ అద్భుత పరిణామంతో అఫ్ఘాన్ క్యాంప్‌లో ఆనందాలు వెల్లివిరిశాయి.

భారత్ – అఫ్ఘానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ సమరం

నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించిన బలమైన టీమిండియా ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28, సోమవారం రోజున నిషిన్ ప్రాంతంలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం సరిగ్గా 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు తలపడటానికి సిద్ధమవుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ వివరాలు

భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరగనున్న ఈ కీలక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను భారతదేశంలో టెలివిజన్ ద్వారా సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే మొబైల్ లేదా ఇతర డిజిటల్ పరికరాల్లో చూడాలనుకునే ప్రేక్షకులు సోని లివ్ యాప్ ద్వారా ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.

ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టు వి 

ఈ టోర్నమెంట్ కోసం ప్రకటించిన భారత బలమైన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us