AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒకప్పుడు టీమిండియా స్టార్.. ఇప్పుడు కేర్ సెంటర్‌లో.. ఆ వీడియో చూసి చలించిపోయిన ఫ్యాన్స్

Viral Video: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానేలోని నిదాన్ కేర్ సెంటర్‌లో ఉన్న కాంబ్లీ తన ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. గతంలో ఎదుర్కొన్న అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ప్రస్తుత పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఒకప్పుడు టీమిండియా స్టార్.. ఇప్పుడు కేర్ సెంటర్‌లో.. ఆ వీడియో చూసి చలించిపోయిన ఫ్యాన్స్
Vinod Kambli
Rakesh
|

Updated on: Sep 26, 2026 | 3:22 PM

Share

Viral Video: భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు అద్భుతమైన ఆటగాడిగా వెలుగొందిన మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో వినోద్ కాంబ్లీ థానేలోని నిదాన్ అనే ఓ వృద్ధాశ్రమం, కేర్ సెంటర్‌లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సచిన్ టెండూల్కర్‎తో కలిసి స్కూల్ రోజుల్లో రికార్డుల మోత మోగించిన ఆనాటి స్టార్ క్రికెటర్, నేడు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించడం అందరినీ కలిచివేస్తోంది.

వీడియోలో కాంబ్లీ ఏం మాట్లాడారంటే?

ప్రణవ్ మహాజన్ అనే క్రికెట్ అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ వీడియోలో వినోద్ కాంబ్లీ తన ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడారు. తాను థానేలోని నిదాన్ కేర్ సెంటర్‌లో ఉన్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన తెలిపారు. ఆ ఆశ్రమంలో ఇస్తున్న సదుపాయాలు, ఇక్కడ చూసుకుంటున్న తీరు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ ఉంటే తనకు ఎక్కడా ఇంటికి దూరంగా ఉన్నట్లు అనిపించడం లేదని, అందరూ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని ఆయన మాట్లాడడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు

గత కొంతకాలంగా వినోద్ కాంబ్లీ వరుసగా ఆర్థిక సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సుమారు ఏడాదిరెండు సంవత్సరాల క్రితం కూడా ఆయన సరిగ్గా నడవలేక ఇబ్బంది పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆయనను మానసికంగా, శారీరకంగా దెబ్బతీశాయి. ఇప్పుడు నేరుగా కేర్ సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్నారనే వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

క్రికెట్ చరిత్రలో వినోద్ కాంబ్లీ అరుదైన రికార్డులు

సచిన్ టెండూల్కర్‎కు అత్యంత ఆప్తమిత్రుడిగా పేరున్న వినోద్ కాంబ్లీ భారత్ తరఫున అనేక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. టీమిండియా తరఫున 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన సుమారు 54 సగటుతో 1,084 పరుగులు సాధించారు. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యంత వేగంగా 1,000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అలాగే 104 వన్డే మ్యాచ్‌లు ఆడి 2,477 పరుగులు చేశారు. ఒకప్పుడు కాంబ్లీ, సచిన్ జోడి క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టేవి. అలాంటి గొప్ప ఆటగాడు ఇప్పుడు ఈ స్థితిలో ఉండటం చూసి క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us