AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీమ్ యాప్‌లో కొత్త AI అసిస్టెంట్.. చాట్ చేస్తే UPI పనులన్నీ పూర్తి!

భీమ్ యాప్‌లో ‘MyUPI’ పేరుతో కొత్త AI అసిస్టెంట్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ సేవల కోసం యాప్‌లోని వివిధ ఆప్షన్లను వెతకాల్సిన అవసరం లేకుండా చాటింగ్ ద్వారా పనులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. లావాదేవీల వివరాలు తెలుసుకోవడం, AutoPay నియంత్రణ, ఫిర్యాదులు చేయడం వంటి పలు పనులను ఒకే చోట నిర్వహించవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగులోనూ ఈ సేవ అందుబాటులో ఉంది.

భీమ్ యాప్‌లో కొత్త AI అసిస్టెంట్.. చాట్ చేస్తే UPI పనులన్నీ పూర్తి!
Myupi Ai Assistant.jpg
Nikhil
|

Updated on: Sep 26, 2026 | 8:25 PM

Share

డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న సమయంలో యూపీఐ సేవలను మరింత సులభంగా నిర్వహించేందుకు కొత్త AI ఫీచర్ వచ్చింది. MyUPI ద్వారా గత లావాదేవీలను తెలుసుకోవడం, మళ్లీ డబ్బు పంపడం, AutoPayని Pause లేదా Cancel చేయడం వంటి పనులు చేయొచ్చు. పేమెంట్ సమస్యలకు ఫిర్యాదు చేసి దాని స్థితిని ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే Safety Switch ద్వారా ఖాతాను రక్షించుకునే సదుపాయం కూడా ఉంది.

AutoPayపై పూర్తి నియంత్రణ

MyUPI ద్వారా వేర్వేరు బ్యాంకులు, UPI యాప్‌లలో జరిగిన లావాదేవీల వివరాలను ఒకే చోట చూడొచ్చు. ఏదైనా చెల్లింపుపై సందేహం ఉంటే చాట్ ద్వారా సమాచారం పొందవచ్చు. గతంలో చేసిన P2P, P2M చెల్లింపుల వివరాల ఆధారంగా అదే ఖాతాకు మళ్లీ డబ్బు పంపేందుకు Transaction Replay సదుపాయం ఉంది. మొబైల్ నంబర్‌కు వచ్చే పేమెంట్లను ఆపి, UPI ID ద్వారా మాత్రమే డబ్బులు స్వీకరించే అవకాశం కూడా ఉంది.

AutoPay చెల్లింపులను కూడా ఒకే చోట నిర్వహించవచ్చు. అవసరాన్ని బట్టి వాటిని Pause, మళ్లీ ప్రారంభించడం లేదా Cancel చేయొచ్చు. UPI PIN లేకుండా ఏదైనా Auto Debit జరిగితే అది ఏ సేవ కోసం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ఈ ఫీచర్ సహాయపడుతుంది.

Safety Switchతో అదనపు రక్షణ

పేమెంట్ చేసే ముందు Payee అసలు పేరును ధృవీకరించేందుకు ‘Pay Safe’ ఉపయోగపడుతుంది. UPI ID లేదా QR కోడ్‌ను అప్‌లోడ్ చేసి వ్యక్తి లేదా సంస్థ వివరాలను కూడా తనిఖీ చేయవచ్చు. చెల్లింపుల్లో సమస్య వస్తే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే Reference Numberతో భీమ్ యాప్‌లోనే సమస్య పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు.

ఫోన్ పోయినా, ఖాతా దుర్వినియోగంపై అనుమానం వచ్చినా, అనుమానాస్పదంగా డబ్బు కట్ అయినా Safety Switch ద్వారా సంబంధిత బ్యాంక్ ఖాతాను వెంటనే బ్లాక్ చేసి తదుపరి లావాదేవీలను అడ్డుకోవచ్చు. యూపీఐ మోసాలు, సైబర్ నేరగాళ్ల మెసేజ్‌లపై అవగాహన కోసం కూడా MyUPIని అడగొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో సేవలు ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలు చేరనున్నాయి. అయితే ప్రతి డబ్బు బదిలీకి భద్రత కోసం UPI PIN తప్పనిసరిగా నమోదు చేయాలి.

Follow Us